దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో బురిడీ: రూ. 88.50 లక్షల మోసం

Published : Feb 01, 2022, 09:39 AM ISTUpdated : Feb 01, 2022, 09:44 AM IST
దుబాయ్‌లో ఉద్యోగాల పేరుతో బురిడీ: రూ. 88.50 లక్షల మోసం

సారాంశం

దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బురిడీ కొట్టించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  జెమ్స్ టెక్ ఇంటర్నేషనల్ సంస్థ విద్యార్ధులకు శిక్షణ ఇస్తోంది. దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈ సంస్థకు అండ్రూస్ అనే వ్యక్తి ఫోన్ చేసి బురిడీ కొట్టించాడు.

హైదరాబాద్: Dubaiలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వందలాది మందిని మోసం చేసిన  వ్యక్తిని Hyderabad పోలీసులు సోమవారం నాడు Arrest చేశారు.హైద్రాబాద్ హెహిదీపట్నం  ప్రాంతానికి చెందిన  Shaik Abdul   అనే వ్యక్తి  జెమ్స్ టెక్ ఇంటర్నేషనల్  ఇనిస్టిట్యూట్  డైరెక్టర్  గా వ్యవహరిస్తున్నాడు.   విద్యార్ధులకు  కోర్సుల్లో శిక్షణ ఇస్తూ కన్సల్టింగ్  సర్వీసెస్ నిర్వహిస్తున్నారు.  అబ్దుల్ కు గత ఏడాది హఫీజ్ మహమ్మద్  అలీ అండ్రూస్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తనను బషీరా జనరల్ ట్రేడింగ్ కంపెనీకి భాగస్వామిగా పరిచయం చేసుకొన్నాడు. Gems Tech Institute ద్వారా దుబాయ్ ఎక్స్ పో ఉద్యోగాల కోసం 2021 ఆగష్టు 5న ఇంటర్వ్యూలు నిర్వహించాడు. 180 మందిలో 170 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్టుగా ఆఫర్ లెటర్స్ కూడా అందించారు. 

వారి నుండి రూ.88.50 లక్షలను వసూలు చేశాడు. అయితే వారిలో 10 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇప్పించాడు.  ఉద్యోగాల కోసం దుబాయ్ వెళ్లిన వారంతా తామంతా మోసపోయామని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితులంతా పర్యాటక వీసాలపై దుబాయ్ లో అడుగు పెట్టారు. బాధిత కుటుంబసభ్యులు హైద్రాబాద్ మెహిదీపట్నంలోని జెమ్స్ టెక్ ఇంటర్నేషనల్ సంస్థకు సమాచారం ఇచ్చారు. జెమ్స్ టెక్ సంస్థ  డైరెక్టర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గతంలో కూడా దుబాయ్ లో ఉద్యోగాల పేరుతో  మోసం చేసిన ఘటనలున్నాయి.  ఉద్యోగాల పేరుతో దుబాయ్‌కి వెళ్లిన వారు మోసపోయిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. అయితే విదేశాల్లో  ప్రత్యేకించి దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కానీ ఇలాంటి నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం సూచిస్తోంది. అయినా కూడా  ఈ తరహ సంస్థలు చేసే ప్రచారాన్ని నమ్మి పలువురు మోసపోతున్నారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu