డబుల్ బెడ్ రూమ్ ఇంటికి తిరస్కరించిన మహిళ.. కారణం తెలిస్తే..

Published : Jan 08, 2021, 03:42 PM IST
డబుల్ బెడ్ రూమ్ ఇంటికి తిరస్కరించిన మహిళ.. కారణం తెలిస్తే..

సారాంశం

లక్ష్మీ అనే మహిళ తనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తిరిగి ఇచ్చేసింది. 

తెలంగాణ ప్రభుత్వం పేద మహిళలకు డబల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. అలా ప్రభుత్వం  ఇచ్చిన డబుల్ బెడ్రూం ని ఓ మహిళ తిరస్కరించింది. అలా తిరస్కరించడానికి ఆమె చెప్పిన కారణం విని అక్కడ ఉన్నవారంతా షాకయ్యారు. కాగా.. మంత్రి హరీష్ రావు అయితే.. ఏకంగా సదరు మహిళను అభినందించారు. ఈ సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లక్ష్మీ అనే మహిళ తనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని తిరిగి ఇచ్చేసింది. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చినందుకు హరీష్ రావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. 

అయితే తాను, తన కుమార్తె మాత్రమే ఉంటామని, తన సోదరుని ఇంట్లో ఉంటున్నామని చెప్పింది. తన కూతురుకు వివాహం జరిగితే తాను ఒంటరిగానే ఉంటానని, ఒంటరిగా ఉండలేను కాబట్టి.. తన సోదరుని వద్దే ఉంటానంది. తనకిచ్చిన ఇల్లు మరో పేద మహిళకు ఇస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇంటిని తిరిగి ఇచ్చేస్తున్నానని లక్ష్మీ తెలిపింది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు అభినందించారు. అందరూ లక్ష్మిలా ఆదర్శవంతగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెను జిల్లా కలెక్టర్, ఛైర్మన్ శాలువ కప్పి సన్మానించారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?