బోయిన్‌పల్లి కేసు: అఖిలప్రియ కస్టడికి కోర్టులో పోలీసుల పిటిషన్

By Siva KodatiFirst Published Jan 8, 2021, 3:23 PM IST
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడి కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెను ఏడు రోజుల పాటు కస్టడికి ఇవ్వాలని కోరారు. అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం వున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు బోయిన్‌పల్లి పోలీసులు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడి కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెను ఏడు రోజుల పాటు కస్టడికి ఇవ్వాలని కోరారు.

అఖిలప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం వున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు బోయిన్‌పల్లి పోలీసులు. అఖిలప్రియ భర్త సహా మిగతా నిందితుల్ని అరెస్ట్ చేయాల్సి వుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

బాధితులతో సంతకాలు చేయించుకున్న దస్త్రాలను స్వాధీనం చేసుకోవాల్సి వుందని నిందితుల్ని అరెస్ట్ చేశాక కిడ్నాప్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి వుందని చెప్పుకొచ్చారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు అఖిలప్రియను కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. 

Also Read:బోయిన్‌పల్లి కిడ్నాప్ : పథకం, అమలు గుంటూరు శ్రీనుదే.. భూమా ఫ్యామిలీకి నమ్మకస్తుడు

ఇక ఈ కేసులో అఖిలప్రియ, సుబ్బారెడ్డి, భార్గవ రామ్‌లను పక్కకు నెట్టి అనూహ్యంగా మరోపేరు తెరపైకి వచ్చింది. గుంటూరుకు చెందిన మాదాల శ్రీను అలియాస్ శ్రీనివాస్ చౌదరి కిడ్నాప్‌ ముఠాకి నాయకుడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

భూమా కుటుంబానికి బాగా దగ్గరైన శ్రీను.. అన్నీ తానై వ్యవహారాలను నడిపిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్ ఎలా చేయాలి.. ఎలా వెళ్లాలి అనే విషయాలపై సినీ ఫక్కీలో స్కెచ్ గీశాడని.. ఆ విధంగానే ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

అందుకోసం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల్లా కనిపించేందుకు డ్రెస్‌లు కూడా అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.గుంటూరుకు చెందిన శ్రీను భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు రైట్‌హ్యాండ్‌గా చెబుతున్నారు.

అఖిల ప్రియ కుటుంబానికి నమ్మదగ్గ.. కీలక అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఉపఎన్నికలోనూ గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. 

click me!