ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్ తో సహా, మరో ఇద్దరు సామూహిక అత్యాచారం...!

Published : Mar 26, 2022, 08:15 AM IST
ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్ తో సహా, మరో ఇద్దరు సామూహిక అత్యాచారం...!

సారాంశం

ఒంటరిగా ఆటో ఎక్కిన యువతిని నమ్మించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడో ఆటో డ్రైవర్. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

హైదరాబాద్ : మహా నగరంలో అడుగడుగునా womenకు ప్రమాదం పొంచి ఉంటోంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి.. ఏ రూపంలో కామాంధులు కాటేస్తారో తెలియని విషమ పరిస్థితులు నెలకొన్నాయి. అలా నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ముగ్గురు యువకులు gang rapeకి పాల్పడిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. కోఠి నుంచి జూబ్లీహిల్స్ వెళ్తున్న యువతిపై auto driver సహా మరో ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. కోఠిలో ఆటో మాట్లాడుకున్న యువతి.. జూబ్లీహిల్స్ కు వెడుతున్న సమయంలో మార్గమధ్యలో స్నేహితులకు ఫోన్ చేసిన ఆటో డ్రైవర్.. వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు.

ఆ తరువాత ఆ యువతిని జిల్లెలగూడ గాయత్రినగర్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు యువతి మీద ముగ్గురు యువకులు కలిసిఅఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తరువాత తన మీద జరిగి ఘోరాన్ని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు ఆ యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Uttar Pradeshలోని ముజఫర్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతని భార్యపై Mass rapeనికి పాల్పడ్డారు కొందరు దుండగులు. బుధవారం రాత్రి ఈ అకృత్యం జరిగినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం భార్యతో కలిసి భర్త స్వగ్రామానికి  కాలినడకన తిరిగి వస్తుండగా దారిలో 10మంది వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆ తరువాత వారిద్దరినీ సమీపంలోని మామిడి తోటల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు.  

అక్కడికి వెళ్లిన తరువాత భర్తను చెట్టుకు కట్టేశారు. అనంతరం వారిలో నలుగురు బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. దీనిపై బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. వారిలో ఇద్దరుమైనర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఇలాంటి ఘటనే ఈ మార్చ్ 18న రాజస్థాన్ లో చోటు చేసుకుంది. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.womanలపై లైంగిక దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ  మార్పు కనిపించడం లేదు. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఓ అమానవీయ ఘటన rajasthanలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్ లోని  ధోల్ పూర్ లో ఓ దళిత మహిళ..  తన భర్త,  పిల్లలతో కలిసి పొలం నుండి ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి.. సదరు మహిళ husbandను తుపాకీతో కాల్చి చంపారు.

ఆ తర్వాత బాధితురాలిని ఆమె పిల్లలను gunతో బెదిరించి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారంతా బాధిత మహిళ గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. నిందితులను లాలూ ఠాగూర్, mohit thakor,  సచిన్ ఠాకూర్ లుగా పోలీసులు గుర్తించారు.  కాగా,  ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా