భార్య చెల్లెలిపై కన్ను.. తననే పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు, తట్టుకోలేక ఆ యువతి చేసిన పని....

Published : Mar 26, 2022, 06:34 AM IST
భార్య చెల్లెలిపై కన్ను.. తననే పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు, తట్టుకోలేక ఆ యువతి చేసిన పని....

సారాంశం

బావ వేధింపులు తాళలేక ఓ మరదలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అక్కను పెళ్లిచేసుకున్న అతను చెల్లి మీదా కన్నేసి వేధింపులకు గురి చేయడంతో ఈ దారుణం జరిగింది.   

ఏన్కూరు : పెద్ద దిక్కు లేని అత్తగారింట్లో బాగోగులు చూసుకోవాల్సిన అల్లుడే మరదలు పాలిట కాలయముడయ్యాడు. wife sisterపై కన్నేసి ఆమె జీవితాన్ని బలి తీసుకున్నాడు.  తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో పాటు... harassmentకు గురి చేయడంతో గత్యంతరం లేని స్థితిలో యువతి పురుగుల మందు తాగి శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది.  ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం  భగవాన్ నాయక్ తండాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన గుగులోతు శ్రీను, చిన్ని దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.  

శ్రీను కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో కుటుంబ భారం చిన్నిపై పడింది. తండాలో వ్యవసాయం చేస్తూ కుమార్తెలను చదివించి పెళ్లిళ్లు చేస్తూ వస్తోంది. ఐదుగురిలో నలుగురికి వివాహం చేసింది. చిన్న కుమార్తె ప్రమీల (22) ఖమ్మంలో పిజి చదువుతోంది. ఆమె కూడా పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలనుకుంది.విజయవాడ సమీపంలోని ఓ యువకుడితో నిశ్చితార్థం చేసి ఏప్రిల్ 10న వివాహానికి నిర్ణయించారు. చిన్నిమూడో అల్లుడు ఖమ్మానికి చెందిన సంతోష్ కొన్నాళ్లుగా ప్రమీలను తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించడం, అసభ్యంగా మాట్లాడటం చేస్తున్నాడు. 

దీంతో తండాలో ఉండలేక తల్లీకూతుళ్లు మరో కుమార్తె ఇంటికి వెళ్లినా అక్కడికీ వెళ్లి వేధిస్తున్నాడు. ఇవన్నీ భరించలేక మనస్తాపం చెందిన ప్రమీల ఈ నెల 22న రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన కొద్దిసేపటికి వాంతులు చేసుకుంటున్న కుమార్తెను చూసి వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇక లేదని తెలుసుకుని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. చిన్ని ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇదిలా ఉండగా, పెళ్లై ఎనిమిది నెలలు అయింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది ఆ నవవధువు. పెళ్లయిన కొద్ది రోజుల వరకు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. పెళ్ళికి కట్నకానుకల కింద రూ. 45 లక్షలు ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజుల నుంచి extra dowry తీసుకుని రావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. husbandతోపాటు అత్తమామలు వేధిస్తుండడంతో భరించలేక ఓ married woman బలవన్మరణానికి పాల్పడింది.  ఈ ఘటన చింతకొమ్మదిన్నె మండలంలోని బృందావన్ కాలనీలో చోటుచేసుకుంది. ఎస్సై మంజునాథ రెడ్డి వివరాల మేరకు..  సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరుకు చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి  కుమార్తె గుగ్గుళ్ల నవిత (25)  ఎంబీఏ వరకు చదువుకుంది.

2021 ఆగస్టులో సికె దిన్నె మండల పరిధిలోని బృందావన్ కాలనీకి చెందిన గుగ్గుళ్ల బాబారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. బాబారెడ్డి వ్యాపారం చేస్తున్నాడు. నవిత ఓ కంపెనీలో పనిచేస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంగా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్తతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు.  వేధింపులు తట్టుకోలేక గురువారం నవిత చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడింది. ఆ తరువాత ఆమె ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పుట్టింటివారు ఆస్పత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. సీకే దీన్నే  తహసిల్దార్ విజయ్ కుమార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు.. నవిత తండ్రి లక్ష్మీ నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా