పరిచయస్తుడని బండెక్కితే.. మద్యం తాగించి, అడ్డాకూలీపై హత్యాచారం...

By SumaBala BukkaFirst Published Dec 8, 2021, 7:38 AM IST
Highlights

నవంబర్ 17న ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె భర్త 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాశ్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు విచారణలో తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకుని కామారెడ్డి శివారులోని లింగాపూర్ పరిధిలో ఆ మహిళ మృతదేహాన్ని చూపించాడు.

కామారెడ్డి : అడ్డా కూలీగా పని చేసుకుని జీవనం సాగించే ఓ Tribal woman హత్యాచారానికి గురైన దారుణ ఘటన కామారె్డి జిల్లా కేంద్రం శివారులో మంగళవారం వెలుగు చూసింది. Kamareddy గ్రామీణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళ (32) కొన్నాళ్లుగా స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో జిల్లా కేంద్ంరలో అడ్డా కూలీగా పనిచేస్తోంది. 

నవంబర్ 17న ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె భర్త 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాశ్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు విచారణలో తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకుని కామారెడ్డి శివారులోని లింగాపూర్ పరిధిలో ఆ మహిళ dead bodyని చూపించాడు.

పనికోసమంటూ ఆ మహిళను ద్విచక్రవాహనం మీద తీసుకుని వచ్చి మద్యం తాగించి rape attempt చేశానని.. ఆ తరువాత గొంతుకు చున్నీ బిగించి murder చేసినట్లు తెలిపాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. 

ఇదిలా ఉండగా, తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది.  రక్షణగా నిలవాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. మహిళలపై rapes and atrocities పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సబ్ ఇన్ స్పెక్టర్. ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. దీంతో తన తప్పు ఎక్కడ బయటపడుతోందోనని ఏకంగా అబార్షన్ కూడా చేయించాడు.

హైదరాబాద్ : వాటర్ ట్యాంక్‌లో బయటపడ్డ మృతదేహం ... ఉలిక్కిపడ్డ స్థానికులు

ఈ అమానుషం మీద సదరు మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఆ ఎస్ఐతో సహా మరో 8మందిపై కేసు నమోదైంది. పోలీసుల సమాచారం మేరకు.. tamilnaduలోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ మహిళ (32)కు వివాహమై 9 యేళ్ల కూతురుంది. భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే, అతను మోసగించడంతో పోలీసులను ఆశ్రయించింది.

కాగా భర్తపై ఫిర్యాదు చేసేందుకు Palugal Police Stationకు వెళ్లిన ఆమెను సబ్ ఇన్ స్పెక్టర్ సుందర లింగం (40)కేసు పేరుతో ఆమెను పలు చోట్లకు తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆమె Pregnancy దాల్చడానికి కారణమయ్యాడు. దీంతో తన నేరం ఎక్కడ బయటపడుతుందోనని బాధితురాలిని సాధారణ వైద్య పరీక్షలని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి.. అబార్షన్ చేయించాడు.

ఈ విషయం తెలసుకున్న బాధితురాలు ఎస్ ఐపై పలుమార్లు, వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. అయినా ఎవరు పట్టించుకోలేదు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయమూర్తి.. సుందరలింగంతో పాటు మరో 8మందిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందులో ఆమెకు Abortion చేసిన వైద్యుడు కూడా ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మార్తాండం పోలీసులు విచారణ ప్రారంభించారు.

click me!