అవి ఆక్రమించుకున్న భూములే.. ఈటల జమున ఆరోపణలకు కలెక్టర్ కౌంటర్

By Siva KodatiFirst Published Dec 7, 2021, 9:37 PM IST
Highlights

ఈటల జమున కొనుగోలు చేసిన 3 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారని మెదక్ కలెక్టర్ హరీశ్ వివరణ ఇచ్చారు. సర్వే నెంబర్ 130లో పట్టా భూమి లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.  భూమిపై ఎలాంటి హక్కు లేని రామారావు నుంచి కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్‌ను చట్ట విరుద్ధంగా చేసుకున్నారని కలెక్టర్ ఆరోపించారు.

ఈటల జమున కొనుగోలు చేసిన 3 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారని మెదక్ కలెక్టర్ హరీశ్ వివరణ ఇచ్చారు. సర్వే నెంబర్ 130లో పట్టా భూమి లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.  భూమిపై ఎలాంటి హక్కు లేని రామారావు నుంచి కొనుగోలు చేసి.. రిజిస్ట్రేషన్‌ను చట్ట విరుద్ధంగా చేసుకున్నారని కలెక్టర్ ఆరోపించారు.

అచ్చంపేటలోని సర్వే నెంబర్ 130 అసైన్డ్ భూమిలో అక్రమంగా పౌల్ట్రీ షెడ్‌ను నిర్మించారని ఆయన అన్నారు. భూముల సర్వే సమయంలో జమునా హ్యాచరీస్ ప్రతినిధులు హాజరై పంచనామాలో సంతకాలు చేశారని కలెక్టర్ తెలిపారు. ఈటల జమున చేసిన ప్రకటన సరైంది కాదన్న ఆయన.. పేదలకు ఇచ్చిన భూమిని జమున హ్యాచరీస్ ఆక్రమించుకుందని ఆయన తెలిపారు. 2011లోనే ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చినట్లు కలెక్టర్ గుర్తుచేశారు. 

Also Read:కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? తెరాస ప్రభుత్వానికి క్లర్క్ గా పని చేస్తున్నారా?.. ఈటెల జమున..

అంతకుముందు  Jamuna Hatcheries కు సంబంధించిన భూములను ఈటెల రాజేందర్ బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ హరీష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈటెల సతీమణి జమున ఆరోపించారు.  సోమవారం Shamir Petaలో ఆమె విలేకరులతో మాట్లాడారు.  మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలలో etela rajender కు చెందిన జమున హెచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్ హరీష్ పేర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

‘జమున హెచరీస్ భూములపై Collector Harish ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విషయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ఆయనకు ఏమి అధికారం ఉంది?  ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాం.  వాళ్ళు వచ్చి మళ్ళీ సర్వే చేశారు.  వాటికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలి. 

‘మీ భూమి ఇదే. ఇంతే ఉంది’ అని కనీసం మాకు ఒక కాఫీ ఇవ్వాలి.  మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదు. ఈరోజు నేరుగా విలేకరుల సమావేశం పెట్టి... భూములు ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్ ఆరోపిస్తున్నారు. కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా?  TRS Governmentకి క్లర్క్ గా పని చేస్తున్నారా?  ఈ విషయమై ఆయన పై policeలకు ఫిర్యాదు చేస్తాం. ఎలాంటి సమస్యలు లేని భూములే Dharani portalలోకి ఎక్కుతాయని గతంలో సీఎం KCR చెప్పారు. 2019లో అలాంటి భూములనే మేము కొనుగోలు చేశాం.  మొత్తంగా మాకు ఉన్నదే  8.36 ఎకరాలు.  కలెక్టర్ చెప్పిన 70 ఎకరాలతో మాకు సంబంధం లేదన్నారు. 

click me!