Hyderabad: ఫొటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీని ఇష్టపడిన యువతి లక్ష్మి ప్రపోజ్ చేసింది. తనకు పెళ్లైందని.. ప్రేమను తిరస్కరించడంతో ఆ యువతి ద్వేషం పెంచుకుంది.
Hyderabad: ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో నీచానికి ఒడిగట్టది. తనకు ఆల్రెడీ పెళ్లైందని, తన ప్రపోజల్ తిరస్కరించడంతో ద్వేషం పెంచుకున్నది. దీంతో ఆ యువతి తన ప్రియుడి, అతని భార్య పాటు అతడి కూతురి న్యూడ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అలాగే.. నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి అసభ్యకర ఫొటోలు పోస్టు చేస్తూ ఇబ్బందులకు గురిచేసింది.
వేధింపులకు, బ్లాక్ మెయిల్స్ పాల్పడింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. వేధింపులకు పాల్పడింది ఓ యువతనీ, ఆమె ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటుంది పోలీసులు గుర్తించారు. దీంతో ఆ యువతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.
వివరాల్లోకెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ అనే యువతిని ఐఏఎస్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఓ ప్రముఖ ఐఏఎస్ సెంటర్‌లో జాయిన్ అయ్యింది. ఈ క్రమంలో ఆ కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీపై మనసు పారేసుకుంది. అనుకున్నదే తడవుగా.. తాను ఇష్టపడిన వ్యకికి తన ప్రపోజ్ చేసింది. కానీ, ఆ వ్యక్తి తనకు పెళ్లైందని.. ప్రేమను తిరస్కరించాడు. దీంతో ఆ యువతి ద్వేషం పెంచుకుంది. ఈ క్రమంలో ఆ ఫ్యాకల్టీ ప్రొఫెసర్, అతని భార్య, కూతురు ఫొటోలను మార్ఫింగ్ చేసింది.
సోషల్ మీడియాలో ఓ ఫేక్ అకౌంట్స్ సృష్టించి న్యూడ్ ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ఆ బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. తనని ప్రేమించలేదంటూ ఫ్యాకల్టీ తో పాటు అతడి రెండేళ్ల కూతురి న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసినట్టు యువతి ఒప్పుకుంది. ఫోటోలను అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులు పాల్పడింది. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు రాసిన యువతి, సివిల్స్ కోసం అశోక్ నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్నది. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసి, యాచకుల పేరుతో సిమ్ కార్డు తీసుకున్న యువతి.