మహిళా పోలీస్ ఇన్స్ పెక్టర్ కు పోకిరీ వేధింపులు

Published : Aug 29, 2017, 03:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మహిళా పోలీస్ ఇన్స్ పెక్టర్ కు పోకిరీ వేధింపులు

సారాంశం

మహిళా పోలీసును ఫోన్ లో వేధిస్తున్న పోకిరీ సిసిఎస్ కు ఫిర్యాదు చేసిన మహిళా సిఐ పోకిరీ వేటలో  సైబర్  క్రైం పోలీసులు

ఆమె మహిళా ఇన్స్ పెక్టర్. డ్యూటీలో ఉంటే డైనమిక్ ఆఫీసరే. ఆమె ప్రస్తుతం సౌత్ జోన్ లో మహిళా పోలీసు స్టేషన్ సిఐ గా పనిచేస్తున్నారు. డైనమిక్ పోలీసు ఆఫీసర్ అయినప్పటికీ ఆమెకు సైతం ఆకతాయి వేధింపులు తప్పలేదు. తాజాతా ఆమెకు ఒక పోకిరీ ఫోన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.

ఫోన్ లో తనపట్ల అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఆమె తెలిపారు. దీనిపై ఆమె సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఆకతాయి ఫోన్ నెంబరును సిసిఎస్ పోలీసులు ట్రేస్ చేసి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కేసును సైబర్ క్రైం పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

ఇక లక్ష్మీ మాధవి గతంలో ఇంటలీజెన్స్ విభాగంలో కూడా పనిచేశారు. ఆమె సిఐ అయినప్పటికీ అందరితో కలివిడిగా ఉంటారని చెబుతారు. మీడియా ప్రతినిధులతో ఆమె సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఆమెను కూడా వేధింపులకు గురిచేయడం ఇటు పోలీసు వర్గాల్లో, అటు మీడియా వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్