యువతిని గదిలో బంధించి.. సెక్యూరిటీ గార్డు అత్యాచారం, చెబితే చంపేస్తానంటూ ..

By Bukka SumabalaFirst Published Aug 8, 2022, 12:25 PM IST
Highlights

తనతో పరిచయం ఉన్న యువతి మీద కన్నేశాడో సెక్యూరిటీ గార్డు.. అదును చూసి ఆమెను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 

హైదారాబాద్ : జూబ్లీహిల్స్ లో సామూహిక అత్యాచార ఘటన ఇంకా మరువకముందే బంజారాహిల్స్ లో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి కాపలాదారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తన్న చిన్మయి సైక్యా(22)తో పరిచయం ఏర్పడింది. 

యువతి మీద కన్నేసిన అతడు ఈ నెల 4న ఆమె ఇట్లో ఎవరూ లేని సమయంలో గదిలో బంధించి అత్యాచారినికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపుతానంటూ బెదిరించాడు. ఈ దారుణాన్ని జీర్ణించుకోలేక.. మరుసటి రోజు ‘తనకు చనిపోవాలని ఉందంటూ’.. స్నేహితురాలికి ఫోన్ లో మెసేజ్ పంపింది. ఆమె బాధితురాలి సోదరికి చెప్పటంతో ఈ దారుణం బయటపడింది. బాధితరురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ సీఐ ఎం.నరేందర్ తెలిపారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

నిర్భ‌య చ‌ట్టం త‌రువాతే అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న‌లు పెరిగాయి - రాజ‌స్థాన్ సీఎం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 6న వరంగల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, అత్యాచారం చేసి.. గర్బం దాల్చడంతో తల్లి, సోదరి సాయంతో అక్రమంగా తొలగించిన ఘటన వరంగల్ బాలాజీనగర్‌లో గత శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. నిందితుడిని కక్కెర్ల ఆకాష్‌గా గుర్తించారు. అతను బాలాజీనగర్‌లో నివసిస్తున్న మైనర్‌ను ప్రేమ పేరుతో నమ్మించి ట్రాప్‌ చేశాడు. ఒకరోజు తన పుట్టినరోజు అంటూ.. ఆకాష్ ఆ అమ్మాయిని ఇంటికి పిలిచాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంటికి వచ్చిన బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత కూడా పలుమార్లు ఆకాష్ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలియగానే ఆకాష్ తన తల్లి, సోదరి సహాయం తీసుకుని స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలోని రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ను ఆశ్రయించాడు. అక్కడ రెండు నెలల క్రితం అక్రమంగా అబార్షన్ చేయించాడు. అయితే అబార్షన్ చేయించేవరకు కూడా మైనర్ బాలికపై ఆకాష్ అత్యాచారం కొనసాగించాడు. 

ఇటు అత్యాచారం చేయడం, అటు అబార్షన్ లతో బాలిక చాలా బలహీనంగా మారింది. ఇది గమనించిన బాలిక తల్లి ఏమయిందని బాలికను నిలదీసింది. అప్పటివరకు తల్లికి విషయం చెప్పని బాలిక అప్పుడు నోరు విప్పింది. తన మీద జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కె. గిరి కుమార్ ఆకాష్, అతని తల్లి, సోదరిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలికకు చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించినందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఆర్‌ఎంపీని కూడా పోలీసులు పట్టుకున్నారు.

click me!