కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. లేఖ అందజేసిన కొన్ని నిమిషాల్లోనే..

By Sumanth KanukulaFirst Published Aug 8, 2022, 11:27 AM IST
Highlights

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాకు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదం తెలిపారు. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను రాజగోపాల్ రెడ్డి సోమవారం శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. రాజీనామా లేఖను అందజేసిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో.. మునుగోడు శాసనసభ స్థానం ఖాళీ గురించి త్వరలోనే ఎన్నికల సంఘానికి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. దీంతో నిబంధనల ప్రకారం మునుగోడు‌ శాసన సభ స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వాహించాల్సి ఉంటుంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

స్పీకర్‌కు రాజీనామా లేఖను అందజేసి బయటకు వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ తన రాజీనామాను ఆమోదించారని చెప్పారు. ఇక, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసేందుకు రాజగోపాల్‌ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. రాజీనామా అనంతరం రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలవనున్నారని సమాచారం. 

click me!