సూర్యాపేట: చున్నీతో కాళ్లుచేతులు కట్టేసి... భర్తను ఉరేసి చంపిన భార్య

Arun Kumar P   | Asianet News
Published : Sep 10, 2021, 10:21 AM IST
సూర్యాపేట: చున్నీతో కాళ్లుచేతులు కట్టేసి... భర్తను ఉరేసి చంపిన భార్య

సారాంశం

సహనాన్ని కోల్పోయిన ఓ వివాహిత కట్టుకున్న భర్తనే ఉరేసి చంపేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

సూర్యాపేట: తాగుబోతు భర్త వేధింపులను తట్టుకోలేక ఓ వివాహిత తన పసుపు కుంకుమలను తానే చెరిపేసుకుంది. పెళ్లయిన నాటి నుండి భర్త వేధింపులను భరిస్తూ వచ్చిన ఆమె సహనం కోల్పోయింది. దీంతో ఈ తాగుబోతు పీడను వదిలించుకోడానికి హంతకురాలిగా మారింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

పెన్ పహడ్ మండలం ధర్మాపురం గ్రామానికి చెంది రామిదేను సంజీవ(33)‌-సునీత భార్యాభర్తలు. అయితే పెళ్లియన నాటినుండి నిత్యం మద్యం సేవించి ఇంటికివచ్చే సంజీవ భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. అయినప్పటికి అతడి వేధింపులను భరిస్తూనే సంసారాన్ని సాగిస్తోంది. అయితే ఆమె సహనాన్ని అలుసుగా తీసుకున్న భర్త ఇటీవల కాలంలో మరింతగా వేధించడం ప్రారంభించాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన సునీత భర్త పీడను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. 

read more  హైదరాబాదులో దారుణం: పాపపై లైంగిక దాడి చేసి, చంపేసి, బొంతలో శవాన్ని చుట్టి....

రోజూ మాదిరిగానే ఫుల్లుగా మద్యం సేవించి తూలుతూనే ఇంటికి చేరుకున్న సంజీవ భార్యతో గొడవకు దిగాడు. దీంతో సునీత ముందుగా చున్నీతో భర్త కాళ్లు చేతులు కట్టేసింది. ఆ తర్వాత అతడి ఉరేసి చంపేసింది. 

ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంజీవ  మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్తను హతమార్చిన సునీతను అదుపులోకి  తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు