స్వప్న ఏమైంది? 18 గంటలైనా దొరకని ఆచూకీ.. కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకిన యువతి కేసులో టెన్షన్, టెన్షన్..

By SumaBala Bukka  |  First Published Sep 29, 2022, 2:17 PM IST

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిమీదినుంచి దూకిన మహిళ ఆచూకీ ఇంకా తెలియలేదు. 18 గంటలు గడుస్తున్నా ఇంకా ఆమెకానీ, మృతదేహం కానీ దొరకకపోవడంతో.. బురదలో కూరుకుపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 


హైదరాబాద్ : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకిన మహిళ ఇంకా లభ్యం కాలేదు. నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి పై నుంచి దుర్గం చెరువులోకి స్వప్న అనే మహిళ దూకింది. 18 గంటలు గడుస్తున్నా ఆమెను కనుగొనలేకపోయారు. జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ బృందాలు స్వప్న కోసం దుర్గం చెరువు జల్లెడ పడుతున్నాయి. నేడు మరోసారి స్పీడ్ బోట్స్, డీఆర్ఎఫ్ సిబ్బందిని పోలీసులు రంగంలోకి దింపారు.  దుర్గం చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో ఆమె ఏమైనా కూలిపోయి ఉంటుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. 

మానసిక స్థితి సరిగా లేకపోవడం, డిప్రెషన్ కు లోను కావడంతోనే దుర్గం చెరువులోకి దూకినట్టు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాదులోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి స్వప్న అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆమె మృతదేహాన్ని ఇప్పటివరకు పోలీసులు వెలికి తీయకపోవడంతో పోలీసుల తీరుపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos

undefined

చెల్లివరసయ్యే వివాహితతో అక్రమసంబంధం.. నిలదీసిన భర్తను కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ నేత..

గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు మృతదేహం బయటకు తీయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో అక్కడ ఏ అధికారి లేకపోవడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై స్వప్న సోదరి సీరియస్ అయ్యారు, ఆత్మహత్య చేసుకునే వరకు పోలీసులు చూసుకోకుండా ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. సప్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది, స్వప్నకు భర్త విడాకులు అయ్యాక డిప్రెషన్కు గురి అయింది ఆ క్షణం నుంచి స్వప్నను  కాపాడుకుంటూ వస్తున్నామని ఆమె సోదరి వాపోయింది.

ఇదిలా ఉండగా, బుధవారం హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి చెరువులోకి దూకింది. ఇది గమనించిన కొందరు లేక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన లేక్ పోలీసులు, యువతి ఆచూకీ కోసం స్పీడ్ బోట్లతో దుర్గం చెరువులో గాలింపులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే, నీళ్లలోకి దూకే సమయంలో యువతి తన చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ను బ్రిడ్జి పైన వదిలేసినట్టుగా తెలుస్తోంది.

దీంతో, వాటి ఆధారంగా యువతి పేరు స్వప్నగా గుర్తించారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. బ్యాగ్ లో దొరికిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను బట్టి స్వప్న కొంతకాలంగా డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దుర్గం చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువతి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు  గజ ఈతగాళ్లు సహాయం కూడా తీసుకుంటున్నారు.

click me!