మెడలో తాళి ఉరితాడుగా బిగిసుకొని...

Published : Mar 14, 2020, 08:36 AM IST
మెడలో తాళి ఉరితాడుగా బిగిసుకొని...

సారాంశం

 తన ఇంటి తలుపులకు వేసిన తాళం చెవిని ఆమె తాళిబొట్టుకు కట్టుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లి తాళిబొట్టులోని తాళం చెవితో ఇంటి తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయింది.

మెడలోని తాళి ఉరితాడుగా మారింది. బొంతుకు బిగుసుకొని ఊపిరాడక ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడలో చోటుచేసుకుంది.

Also Read డేటింగ్ యాప్ లో అమ్మాయిల నగ్న చిత్రాలు.. యువకులకు ఎర..

పూర్తి వివరాల్లోకి వెళితే... దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన కనుకుంట్ల ఎల్లమ్మ(50) అనే మహిళ గ్రామంలోని రెండో అంగన్ వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. తన ఇంటి తలుపులకు వేసిన తాళం చెవిని ఆమె తాళిబొట్టుకు కట్టుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లి తాళిబొట్టులోని తాళం చెవితో ఇంటి తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయింది.

దీంతో పసుపుతాడు మెడకు బిగుసుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు