కరోనా ఎఫెక్ట్: రూ. 1500 కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్లో నిలబడి మహిళ మృతి

By narsimha lode  |  First Published Apr 17, 2020, 2:08 PM IST

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారంనాడు విషాదం చోటు చేసుకొంది. బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన రూ. 1500 తీసుకొనేందుకు వచ్చిన మహిళ మృతి చెందింది


కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారంనాడు విషాదం చోటు చేసుకొంది. బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన రూ. 1500 తీసుకొనేందుకు వచ్చిన మహిళ మృతి చెందింది.కరోనాలాక్ డౌన్ నేపథ్యంలో  రేషన్ కార్డు కలిగిన వారికి నెలకు 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం, రూ. 1500 నగదును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.

మృతురాలిని కన్నాతండాకు చెందిన నానోతు కమలగా గుర్తించారు. ఆమె వయస్సు 45 ఏళ్లు.రూ. 1500 నగదును రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో మూడు రోజుల నుండి జమ చేస్తోంది. ఈ నగదును డ్రా చేసుకొనేందుకు బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున లబ్దిదారులు వస్తున్నారు. 

Latest Videos

undefined

also read:ఏ ప్రాతిపదికన రిటైర్డ్ ఉద్యోగులకి సగం పెన్షన్: తెలంగాణ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్న

బ్యాంకుల వద్దకు పెద్ద ఎత్తున ఈ నగదును డ్రా చేసుకొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజుల నుండి పెద్ద ఎత్తున జనం వస్తున్నారు.రామారెడ్డి మండలకేంద్రంలోని ఓ బ్యాంకు వద్ద కూడ ఓ మహిళ రూ. 1500ల నగదును డ్రా చేసుకొనేందుకు శుక్రవారం నాడు వచ్చింది.

బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున జనం ఉన్నారు. దీంతో ఆమె క్యూ లైనులో నిల్చొంది. క్యూలో చాలాసేపు నిలబడిన ఆమె సొమ్మసిల్లిపడింది.స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే ఆమె మృతి చెందింది.

click me!