కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని మహిళ మృతి

Published : Oct 14, 2021, 07:54 AM ISTUpdated : Oct 14, 2021, 11:00 AM IST
కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని మహిళ మృతి

సారాంశం

కోడిగుడ్డు తినడం వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోతుందని ఎవరైనా ఊహించగలరా..? కానీ ఓ మహిళ విషయంలో అదే జరిగింది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందారు.

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ గుడ్డు తినాలని పోషకార నిపుణులు చెబుతూ ఉంటారు. అలాంటి కోడిగుడ్డు తినడం వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోతుందని ఎవరైనా ఊహించగలరా..? కానీ ఓ మహిళ విషయంలో అదే జరిగింది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందారు.
ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: సీన్ రివర్స్.. యువకుడి న్యూడ్ వీడియోలు తీసి వేధిస్తున్న యువతి..

నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ(50) ఇంట్లో భోజనం చేస్తూ ఉడకపెట్టిన కోడిగుడ్డును తినేందుకు నోట్లో పెట్టుకుంది. కాగా.. పొరపాటున ఆ గుడ్డు  జారి గొంతులోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  కుటుంబసభ్యులు గుర్తించి ఆ గుడ్డు బయటకు తీసేలోపే... ఆమె ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా.. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ వ్యక్తి మిర్చీ బజ్జీ గొంతులో ఇరుక్కోని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మల్లేశ్(40) మంగళవారం రాత్రి తన సొంత గ్రామానికి వచ్చాడు.

రాత్రి ఇంటి మిద్దెపై కూర్చోని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర్చి తింటుండగా మిర్చి గొంతుకు అడ్డుపడడంతో మృతి చెందాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు మిద్దె పైకి వెళ్లేసరికి మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !