తుక్కుగూడలో దారుణం.. గోనె సంచిలో మహిళ మృతదేహం గుర్తింపు..

Published : Apr 12, 2023, 11:46 AM IST
తుక్కుగూడలో దారుణం.. గోనె సంచిలో మహిళ మృతదేహం గుర్తింపు..

సారాంశం

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ దారుణం చోటుచేసుకుంది. తుక్కుగూడలో గోనె సంచిలో ఓ మహిళ మృతదేహాం లభ్యమైంది.

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ దారుణం చోటుచేసుకుంది. తుక్కుగూడలో గోనె సంచిలో ఓ మహిళ మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళను చంపిన  అనంతరం గోనె సంచిలో ప్యాక్ చేసిన తుక్కుగూడలో రోడ్డు పక్కన పొదల్లో పడేసినట్టుగా తెలుస్తోంది. ఇక, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై పోలీసులు విచారణ  చేపట్టారు. ఆ మృతదేహం ఎవరిది?, మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది?, ఎవరు హత్య చేశారు? అనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం