
కుషాయిగూడ : Financial difficulties, Debt troubles దంపతుల ఉసురుతీశాయి. మేడ్చల్ జిల్లా నేతాజీ నగర్ కు చెందిన వై. కొండయ్య (55), భూలక్ష్మి (49) భార్యాభర్తలు. సోమవారం రాత్రి బొల్లారం క్యావలరీ బ్యారక్ రైల్వే స్టేషన్ నాగ దేవత ఆలయం సమీపంలో రైలు కింద పడి suicide చేసుకున్నారు. జిఆర్ పి ఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ రాజ్ అక్కడికి చేరుకున్నారు. పట్టాలపై రెండు dead bodyలు ఉన్నట్లు గుర్తించి రాచకొండ పోలీసులకు సమాచారం అందించారు.
అప్పటికే కుషాయిగూడ పోలీసులకు తన parents కనిపించడం లేదని వారి కుమార్తె ( కానిస్టేబుల్) ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు.. జిఆర్పి పోలీసులతో వివరాలు పంచుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతి చెందినవారు మహిళా కానిస్టేబుల్ తల్లిదండ్రులుగా గుర్తించారు. జీఆర్పీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… కొండయ్య ఆర్మీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సబేరియాలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.
భూలక్ష్మి గృహిణి. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. కూతురు ఆశాజ్యోతి కుషాయిగూడ ఠాణాలో కానిస్టేబుల్, చిన్న కుమారుడు శ్రవణ్ కుమార్ బెంగళూర్ లో ప్రైవేటు ఉద్యోగి. పెద్ద కుమారుడు, కుమార్తె వివాహాలు జరిగాయి. వీరికీ ఇద్దరు సంతానం. వీరంతా తల్లిదండ్రుల వద్ద ఒకే ఇంట్లో ఉంటున్నారు.
పదేళ్లక్రితం కుమార్తె వివాహ సమయంలో కొంత అప్పు చేసినట్లు సమాచారం. కరోనా కారణంగా ఇద్దరు కుమారులకు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని కోసం మరోసారి అప్పులు చేసినట్లు తెలుస్తోంది. రూ. 20 నుంచి 25 లక్షలకు చేరిన అప్పులు తీర్చకపోవడంతో ఎదురవుతున్న అవమానాలతో భార్యాభర్తలు మరింత మనోవేదనకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఈ దంపతులు ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం 6 7 గంటల సమయంలో వారిద్దరూ ఇంటి నుంచి టూ వీలర్ పై బయటకు వచ్చారు. రైలు పట్టాల కు దగ్గరలో వాహనాన్ని నిలిపి… పట్టాల పైకి చేరి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు…
కుషాయిగూడలో మిస్సింగ్ కేసు…
కాప్రాలోని ఇంటి నుంచి దంపతులు సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లారు. రాత్రి పది అవుతున్నా.. తల్లిదండ్రులు ఇంటికి రాకపోవడంతో వారి కొడుకు, కూతురు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదయింది.
ఇదిలా ఉండగా, ఈ జనవరి 27న అప్పుల బాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ముగ్గురు farmers suicideలకు పాల్పడ్డారు. వేసిన పంట నష్టపోగా, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మీరు బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ కౌలు రైతు ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో నూనె రాజశేఖర్ (28), మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్ర చక్రుతండాకు చెందిన జాటోతు బొడ్యా (55), భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లికి చెందిన పుట్ట రవి(38) లు ఆత్మహత్య చేసుకున్న రైతులు.