‘నిమ్మరసంతో సంతానం కలిగిస్తాం..’, ‘గుప్తనిధులు తీసి ధనవంతుల్ని చేస్తాం’... నకిలీ బాబాల అరెస్ట్, రిమాండ్..

Published : Feb 02, 2022, 07:58 AM IST
‘నిమ్మరసంతో సంతానం కలిగిస్తాం..’, ‘గుప్తనిధులు తీసి ధనవంతుల్ని చేస్తాం’... నకిలీ బాబాల అరెస్ట్, రిమాండ్..

సారాంశం

నకిలీ స్వామి అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు.  సీఐ కృష్ణ మోహన్ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి గ్రామానికి చెందిన పర్వతం స్వామి అలియాస్ నాగరాజు స్వామి, పర్వతం సైదులు అలియాస్ సహదేవ స్వామి, సిరసాల బక్కయ్య కలిసి స్వామి అవతారం ఎత్తి ‘మీ ఇంట్లో గుప్తనిధులు తీస్తాం, మేము మంత్రాలు చదివితే సర్వ రోగాలు మాయం అవుతాయి, మేమిచ్చే నిమ్మకాయ నీరు తాగితే సంతానం కలుగుతుందని’ ప్రజలను మోసం చేస్తున్నారు.

మాడుగుల :  మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అంటే రాలగొట్టి చూపిస్తాం అంటూ ఈ నfake babaలు జనాల్ని మోసం చేస్తున్నారు. గుప్తనిధులు, సంతానం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. lemon water తాగితే సంతానం కలుగుతుందంటూ నయా fraudకి తెరలేపిన ఈ నకిలీ బాబాలు గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెడితే...

నకిలీ స్వామి అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు.  సీఐ కృష్ణ మోహన్ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి గ్రామానికి చెందిన పర్వతం స్వామి అలియాస్ నాగరాజు స్వామి, పర్వతం సైదులు అలియాస్ సహదేవ స్వామి, సిరసాల బక్కయ్య కలిసి స్వామి అవతారం ఎత్తి ‘మీ ఇంట్లో గుప్తనిధులు తీస్తాం, మేము మంత్రాలు చదివితే సర్వ రోగాలు మాయం అవుతాయి, మేమిచ్చే నిమ్మకాయ నీరు తాగితే సంతానం కలుగుతుందని’ ప్రజలను మోసం చేస్తున్నారు. 

మండలంలోని కలకొండ, అన్నెబోయిన్పల్లి,  అందుగుల, పరిసర గ్రామాల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశారు.  ప్రజల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి..  వారి వద్ద నుంచి సుమారు రూ.13  లక్షలు  స్వాధీనం  చేసుకుని…రిమాండ్ కు పంపినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్టులో నల్గొండలో ఓ బడా బురిడీ బాబా భాగోతం వెలుగులోకి వచ్చింది. నల్గొండలో బురిడీ బాబా విశ్వచైతన్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బాబాకు 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లైంగికంగా కలిస్తే తనలోని శక్తులు మీకూ వస్తాయని మహిళలను విశ్వచైతన్య నమ్మించాడని తేలింది. మాయమాటలతో మహిళలను ట్రాప్ చేసి వీడియో కాల్స్ చేసేవాడని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. 

బురిడీ బాబా నుంచి రూ.26 లక్షల నగదు, పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అతని రెండో భార్య సుజితపైనా రూ.1.30 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నట్లు ఎస్పీ తెలిపారు. సదరు దొంగబాబా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలతో బాధపడుతున్నా సరే.. అమావాస్య, పున్నమికి వస్తే ప్రత్యేక పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తా.. అని నమ్మబలికాడు. అయితే ఓ మహిళ ఫిర్యాదుతో దొంగ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి. 

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్‌ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ. కోట్లు వసూలు చేశాడు.

అయితే ఇటీవల తన సమస్యను తొలగిస్తానని సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ రంగనాథ్‌ ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్‌ బాండ్లు, లాప్‌టాప్‌లు, ప్రవచన పుస్తకాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఆరు నెలలుగా బురిడీ బాబా.. సాయిబాబా భక్తునిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు..
 
PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే