తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారు: బిక్కనూరు సీఐపై హెచ్ఆర్‌సీకి మహిళ ఫిర్యాదు

Published : Jun 04, 2021, 09:42 AM IST
తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారు: బిక్కనూరు సీఐపై హెచ్ఆర్‌సీకి  మహిళ ఫిర్యాదు

సారాంశం

 కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు  సీఐ అభిలాష్ పై  లావణ్య అనే మహిళ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది.  సీఐ తనను బెదిరిస్దున్నాడని ఆమె ఆ ఫిర్యాదులో ఆరోపించింది.

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు  సీఐ అభిలాష్ పై  లావణ్య అనే మహిళ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది.  సీఐ తనను బెదిరిస్దున్నాడని ఆమె ఆ ఫిర్యాదులో ఆరోపించింది. గత నెల 14వ తేదీన ఖానాపూర్ పెద్ద చెరువు కట్టపై తీవ్ర గాయాలతో బిక్కనూరుకు చెందిన శంకర్ పడి ఉన్నాడు. ఈ విసయాన్ని స్థానికులు గమనించి ఆయనను ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.  ఈ విషయమై  శంకర్ భార్య లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  శంకర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని  సీఐ తనను బెదిరిస్తున్నాడని లావణ్య ఆరోపించారు.  తన భర్త మృతిపై సీఐ తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె చెప్పారు.  సీఐ బెదిరింపులపై మానవ హక్కుల కమిషన్ కు లావణ్య ఫిర్యాదు చేసింది. సీఐ నుండి తన కుటుంబాన్ని రక్షించాలని ఆమె కోరారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అంతేకాదు తన భర్త  మరణానికి గల కారణాలపై వాస్తవాలను కూడ బయటపెట్టాలని ఆమె కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి