హైదరాబాద్ లో దారుణం : నడిరోడ్డు మీద శిశువు శరీర భాగం.. !

Published : Jun 04, 2021, 09:16 AM IST
హైదరాబాద్ లో దారుణం : నడిరోడ్డు మీద శిశువు శరీర భాగం.. !

సారాంశం

హైదరాబాద్ లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల డివిజన్ ఎంఎన్ రెడ్డి నగర్ ఫేజ్-2 హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రధాన రహదారిమీద ఓ శిశువు శరీర భాగం లభ్యమయ్యింది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాలిలా ఉన్నాయి. 

సుమారు 5 నుంచి 7 నెలల ఉండే ఓ శిశువు ఛాతి సగభాగంతో కూడిన ఎడమచేయి రోడ్డు మీద పడి ఉండడాన్ని గురువారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు డాగ్ స్క్వాడ్ తో ఘటనా స్థలానికిి చేరుకుని దర్యాప్తు చేశారు. 

డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలు, ఓపెన్ నాలా, ఇతరత్రా ప్రాంతాల వైపు వెళ్లి వెనుతిరిగాయి. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైన మృతి చెందిన శిశువును నిర్మానుష్య ప్రదేశాల్లో పేడయడంతో వీధి కుక్కలు అక్కడినుంచి లాక్కొచ్చి ఉంటాయని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. 

అయితే, అదే కాలనీలో గత సెప్టెంబర్ నెలలో మరో శిశువు తల కూడా లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నారు. శిశువు శరీర భాగాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్