
రెండు రోజుల క్రితం వనస్థలీపురంలో ఓ మహిళ అగ్నికి ఆహుతైంది. కాగా.. ఆమె మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడం వల్ల లేదా.. ఎవరైనా ఆమెను పథకం ప్రకారం హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆమెది ఆత్మహత్య గా తేలింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని వనస్థలీపురంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వనస్థలీపురానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతికి పెళ్లైంది. కాగా.. ఆమెకు భర్తతో కొన్ని సంవత్సరాలుగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ కారణంగానే సోమవారం ఉదయం ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
గదిలో తనకు తానే ఒంటికి నిప్పు అంటించుకుంది. అక్కడే ఉన్న భర్త.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతి కష్టం మీద పిల్లలను కాపాడగలిగాడు. కాగా.. సరస్వతి మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
తొలుత షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావించారు. అయతే.. తర్వాత దర్యాప్తులో ఆమె ఆత్మహత్య చేసుకన్నట్లు నిర్థారించారు. ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.