తెలంగాణలో నిలకడగానే కరోనా ఉద్ధృతి: కొత్తగా 3,821 కేసులు... 23 మంది మృతి

Siva Kodati |  
Published : May 25, 2021, 09:38 PM IST
తెలంగాణలో నిలకడగానే కరోనా ఉద్ధృతి: కొత్తగా 3,821 కేసులు... 23 మంది మృతి

సారాంశం

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,203 నమూనాలను పరీక్షించగా 3,821 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది . 

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,203 నమూనాలను పరీక్షించగా 3,821 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,60,141కి చేరింది. ఇవాళ కోవిడ్ వల్ల 23 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 3,169కి పెరిగింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 38,706 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌‌లో పేర్కొంది. మంగళవారం 4,298 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లుగా తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 537 మందికి పాజిటివ్‌గా తేలింది.  

Also Read:కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి కొత్తగూడెం 116, జగిత్యాల 111, జనగామ 39, జయశంకర్ భూపాలపల్లి 56, జోగులాంబ గద్వాల 69, కామారెడ్డి 25, కరీంనగర్ 172, ఖమ్మం 245, కొమరంభీం ఆసిఫాబాద్ 19, మహబూబ్‌నగర్ 128, మహబూబాబాద్ 98, మంచిర్యాల 116, మెదక్ 45, మేడ్చల్ మల్కాజిగిరి 215, ములుగు 58, నాగర్ కర్నూల్ 132, నల్లగొండ 187, నారాయణ పేట 26, నిర్మల్ 14, నిజామాబాద్ 44, పెద్దపల్లి 147, రాజన్న సిరిసిల్ల 79, రంగారెడ్డి 226, సంగారెడ్డి 103, సిద్దిపేట 104, సూర్యాపేట 214, వికారాబాద్ 103, వనపర్తి 105, వరంగల్ రూరల్ 87, వరంగల్ అర్బన్ 146, యాదాద్రి భువనగిరిలలో 40 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu