సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి వేగంగా నడుచుకుంటూ వెళ్లుతుండగా.. ఓ మహిళ గొంతు రేవంత్ అన్నా.. రేవంత్ అన్నా.. అని ఆర్తిగా పిలవడం వినిపించింది. ఆయన వెంటనే ఆగిపోయి ఆమె వైపు కదిలాడు. ఆమె తన సమస్యను చెప్పుకుంది. పరిశీలించి పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: మేం పాలకులం కాదు.. సేవకులం అని ప్రమాణ స్వీకారం రోజే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రజా దర్బార్ నిర్వహించి ఆయన స్వయంగా ప్రజల సమస్యలు విన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి.. మంత్రులకే కాదు.. ప్రజలకూ అందుబాటులో ఉంటాడనే సంకేతాలను ఆయన బలంగా పంపించారు. అయితే, ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ఓ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతున్నది.
సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి వేగంగా నడుచుకుంటూ వెళ్లుతుండగా.. సెక్యూరిటీ ఆపడంతో అదే దారికి కొంత దూరంలో కొందరు నిలబడి ఉన్నారు. అందులో నుంచి ఓ యువతి సీఎం రేవంత్ రెడ్డిని పిలిచింది. రేవంత్ అన్నా.. రేవంత్ అన్నా.. మీతో కొంచెం మాట్లాడాలన్నా.. అని పిలిచింది. ఆమె పిలుపు వినగానే రేవంత్ రెడ్డి వెంటనే ఆగిపోయారు. ఆమె వైపుగా వెంటనే వచ్చేశారు. ఆమెతో నేరుగా మాట్లాడారు.
Also Read: India Bloc: మళ్లీ ఇండియా కూటమి హడావిడి.. 19న ఢిల్లీలో భేటీ, సీటు షేరింగ్‌పై డిస్కషన్!
CM Revanth Responded to the Grievance of Common People Issue Quickly
రేవంత్ అన్న అంటూ పిలిచి సమస్య చెప్పుకున్న మహిళ.
-- వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Revanth was called by a women Quoted him 'Revanth Anna' and told her the… pic.twitter.com/p0zML3KrWW
ఆమె తన సమస్యను చెప్పుకుంది. డబ్బులకు సంబంధించిన సమస్య ఆమె వివరించింది. ఆ సమస్యను సీఎం ఆలకించి అధికారులతో చర్చించారు. ఆ సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులకూ ఆదేశించారు. 30 సెకండ్ల నిడివితో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మందిని ఆకర్షిస్తున్నది. ప్రజల సీఎం అని, దటీజ్ రేవంత్ రెడ్డి అన్నా అని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ వీడియోలోని ఘటన ఎక్కడ జరిగింది? ఎన్నడు జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. ప్రజా దర్బార్ జరిగిన రోజే జరిగిందా? అనేది కూడా తెలియదు.