విషయం తెలుసుకున్న శ్రీనివాస్ భార్య సునీత.. పద్మ ఇంటికి వెళ్లి తన భర్త తో ఎందుకు Illegal relationship పెట్టుకున్నావని నిలదీసింది. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి పద్మను సునీత చితక్కొట్టింది.
పెద్దపల్లి : తన భర్త తో మరో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని సదరు మహిళను భార్య చితక్కొట్టింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్గా పనిచేస్తున్న శ్రీనివాస్… పద్మ అనే మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న శ్రీనివాస్ భార్య సునీత.. పద్మ ఇంటికి వెళ్లి తన భర్త తో ఎందుకు Illegal relationship పెట్టుకున్నావని నిలదీసింది. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి పద్మను సునీత చితక్కొట్టింది.
undefined
అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య...
వివాహేతర సంబంధాలు దారుణాలకు దారి తీస్తాయి. ఈ విషయం తెలిసి కూడా కోరి కోరి క్షణికావేశంలో అలాంటి నీచమైన సంబంధాల్లోకి దిగి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ సంఘటనే నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో దారుణానికి దారితీసింది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అక్టోబర్ 13న ఉదయం నడిరోడ్డుపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఉద్యోగిని కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో నుంచి ఆధార్ కార్డు తీసుకుని వివరాలు సేకరించి కేసు విచారణ మొదలుపెట్టారు. ఆ విచారణలో అనుకోని నిజాలు వెలుగుచూశాయి.
16వ అంతస్తు నుంచి కిందపడి టెక్కీ మృతి..!
ఇండోర్ నగరానికి చెందిన ఆకాష్ ఒక bpo ఉద్యోగి. ఏడాదిన్నర కిందటే ఆకాష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఒకరోజు ఆకాష్ తన భార్య మోనాని ఆస్పత్రికి వెళ్ళడానికి బస్టాప్ వద్ద వదిలి ఇంటికి వస్తుండగా దారిలో ఇద్దరు దుండగులు అతడిపై attack చేశారు. ఆకాశ్ కళ్ళల్లో మిర్చి పొడి చల్లి అతడిని కత్తితో పొడిచి murder చేశారు. దాంతో ఆకాష్ అక్కడికక్కడే చనిపోయాడు.
పోలీసులు ఆకాష్ వద్ద దొరికిన aadhar card, సీసీటీవీ వీడియో ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఆకాష్ భార్య మోనా కు పోలీసులు సమాచారం అందించారు. ఈ హత్య వెనుక డబ్బులకు సంబంధించిన లావాదేవీల వ్యవహారం ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. సీసీటీవీ వీడియో ఆధారంగా దుండగులు వచ్చిన బైక్ నెంబర్ తెలుసుకుని వారి కోసం గాలించారు. ఇండోర్ పరిసరాల్లో ఉన్న అన్ని టోల్ప్లాజా సీసీటీవీ వీడియోలను వెతికి చివరికి ఆ దుండగులు సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి వారిని అరెస్టు చేశారు.
పోలీసులు ఆ ఇద్దరు నిందితులను విచారణ చేయగా.. వారు కేవలం ఆకాశ్ ను బెదిరించడానికి అక్కడికి వెళ్ళామని.. కానీ ఆకాష్ వారిని ఎదిరించడంతో అతడిని అనుకోకుండా knifeతో పొడవాలి వచ్చిందని చెప్పారు. పోలీసులు నగరంలో ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ మనీష్ శర్మ కోసం ఆస్పత్రికి వెళ్లగా కొన్ని రోజులుగా సెలవుపై రాజస్థాన్ వెళ్ళాడు అని తెలిసింది.
Dr. Manish గురించి పోలీసులు విచారణ చేయగా అతనికి తోటి మహిళా ఉద్యోగుల తో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆస్పత్రిలో పోలీసులకు మరో విషయం అనుకోకుండా తెలిసింది. అదే ఆస్పత్రిలో మృతుడు ఆకాష్ భార్య mona పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులకు మోనా పై అనుమానం వచ్చింది.మోనా ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేశారు. మోనాకు డాక్టర్ మనిషితో Extramarital affair ఉందని తేలింది.పోలీసులు మోనాను అరెస్టు చేశారు. ఆమెను పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో అసలు నిజం ఒప్పుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. love marriage చేసుకున్న కొద్దికాలానికి ఆస్పత్రిలో కొత్తగా డాక్టర్ మనీష్ చేరాడు. ఆ తరువాత డాక్టర్ మనీష్ మోనా ప్రేమించుకున్నారు. కొద్దికాలం తరువాత ఆకాష్ కు ఈ విషయం తెలిసింది. దీంతో మోనామీద చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా డాక్టర్ మనీష్ వద్దకు వెళ్లి తన భార్య జోలికి రావొద్దని హెచ్చరించాడు. దీంతో మోనా ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది.
డాక్టర్ మనీష్ తో కలిసి ఆకాష్ ను భయపెట్టాలని ప్లాన్ వేసింది. డాక్టర్ మనీష్ తనకు తెలిసిన ఇద్దరు కిరాయి రౌడీలను ఆకాష్ ను బెదిరించమని పంపాడు. వారు అక్టోబర్ 13న ఆకాష్ ఒంటరిగా ఉన్న సమయంలో అతడి మీద దాడి చేసి బెదిరించడానికి ప్రయత్నించారు. ఆకాష్ వారిద్దరినీ ఎదురించాడు. దీంతో ఆ రౌడీలు ఆకాష్ ను కత్తితో పొడిచేశారు. దీంతో ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం డాక్టర్ మనీష్ పరారీలో ఉన్నాడు. పోలీసులు మోనా, డాక్టర్ మనీష్ పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.