16వ అంతస్తు నుంచి కిందపడి టెక్కీ మృతి..!

Published : Oct 23, 2021, 10:25 AM ISTUpdated : Oct 23, 2021, 10:33 AM IST
16వ అంతస్తు నుంచి కిందపడి టెక్కీ మృతి..!

సారాంశం

ఇది ఆత్మహత్య లేక.. ప్రమాదవశాత్తు పడిపోయారా అన్న విషయంలో క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి.. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.

16 వ అంతస్తు నుంచి కింద పడి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని నార్సింగ్ లో గరువారం చోటుచేసుకుంది. తమ ఇంటి బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: నేడు దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన.. ప్రపంచంలోనే అతిపెద్ద స్కీన్ ఇదే...

అయితే.. ఇది ఆత్మహత్య లేక.. ప్రమాదవశాత్తు పడిపోయారా అన్న విషయంలో క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి.. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు.

Also Read:Yadadri Temple : కేసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు.. స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కితాబు.. (వీడియో)

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ జంక్షన్ సమీపంలోని గేటెడ్ కమ్యూనిటీ లో ఆయన తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కాగా.. తన ఇంట్లోని బాల్కీనీలో నుంచే అతను కింద పడటం గమనార్హం. ఆయన కింద పడగానే.. ఆయన భార్య వెంటనే ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రికి వెళ్లేలోపే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు