ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు: హుజురాబాద్‌ బరిలో 37 మంది.. బద్వేల్‌లో 15 మంది

By Siva Kodati  |  First Published Oct 13, 2021, 3:50 PM IST

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న హుజురాబాద్ (Huzurabad ByPoll), బద్వేల్ ఉపఎన్నిక (badvel ByPoll)కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో హుజురాబాద్ బైపోల్ బరిలో 37 మంది, బద్వేల్ బరిలో మొత్తం 15 మంది వున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.


తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న హుజురాబాద్ (Huzurabad ByPoll), బద్వేల్ ఉపఎన్నిక (badvel ByPoll)కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. హుజురాబాద్‌లో ఈటల జమున, (etela jamuna)  కాంగ్రెస్ (congress) పార్టీ రెబల్ అభ్యర్ధి లింగారెడ్డిలు (lingareddy) నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. వీరితో పాటు ఐదుగురు అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో హుజురాబాద్ బైపోల్ బరిలో 37 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్ధులు. 29 మంది స్వతంత్రులు, ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్ధులు వున్నారు. అటు బద్వేల్ విషయానికి వస్తే..  ఇవాళ చివరి రోజు ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో బద్వేల్ బరిలో మొత్తం 15 మంది వున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు. 

Latest Videos

undefined

ALso Read:Huzurabad Bypoll: కేసీఆర్ కు ధీటుగా... అమిత్ షా, నడ్డాలతో బిజెపి మాస్టర్ ప్లాన్

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈనెల 8 వరకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణకు ఈ రోజు వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 30న పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. ఉపపోరుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారికి నిబంధనలను వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఇక ప్రచార పర్వం ఊపందుకునే అవకాశం వుంది.

అటు బద్వేల్ విషయానికి వస్తే.. వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (venkata subbaiah) ఆకస్మిక మరణంతో బద్వేల్‌ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. కోవిడ్‌తో వాయిదా పడిన ఎన్నికలను అక్టోబర్‌లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (election commission) షెడ్యూలు విడుదల చేసింది. అయితే, దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణికే వైసీపీ టికెట్‌ ఇచ్చినందున జనసేన (janasena) పోటీ చేయడం లేదని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (pawan kalyan) ప్రకటించారు. పవన్ పోటీకి దూరమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే టీడీపీ (tdp) సైతం విరమించుకుంటున్నట్లు వెల్లడించింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ తాము బద్వేల్ ఉపఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 

Also Read:Badvel bypoll: బిజివేముల కోట 'బద్వేల్', కాంగ్రెసేతర పార్టీలదే ఆధిపత్యం

అయితే, బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఈ మేరకు పనతల సురేశ్‌ను అభ్యర్ధిగా వెల్లడించింది. మిత్రపక్షమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనకు భిన్నంగా ఏపీ బీజేపీ (bjp) అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) సీరియస్ కామెంట్స్ చేశారు. బద్వేల్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. వైసీపీకి భయపడాల్సిన అవసరం లేదని బద్వేల్ ఎన్నికకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

click me!