లాక్ డౌన్ లో ఇరుక్కున్న వలస కూలీలు.. మంత్రి ఔదార్యంతో కథ సుఖాంతం

By telugu news teamFirst Published Mar 31, 2020, 9:47 AM IST
Highlights

సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పాచ్యతండా కు చెందిన 26 మంది కూలిపనులకు గాను పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ లోని పులిచింతల ఆయకట్టు పనులకు వెళ్లారు.   అంతవరకు బాగానే ఉండనుకుంటున్న వారికి కరోనా వైరస్ నేపద్యంలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ వారి పనులకు ప్రతిబందకమై పనులకు అంతరాయం ఏర్పడింది.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ పై పోరాడటానికి భార‌త ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించింది.   ఈ నేపథ్యంలో సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో సరిహద్దుల్లో చిక్కుకున్న వలస కూలీలు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చూపిన చొరవతో ఎట్టకేలకు సొంత గూటికి చేరుకున్నారు.


సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పాచ్యతండా కు చెందిన 26 మంది కూలిపనులకు గాను పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ లోని పులిచింతల ఆయకట్టు పనులకు వెళ్లారు.అంతవరకు బాగానే ఉండనుకుంటున్న వారికి కరోనా వైరస్ నేపద్యంలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ వారి పనులకు ప్రతిబందకమై పనులకు అంతరాయం ఏర్పడింది.

Also Read ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత: ఎవరెవరికి ఎంతెంతనంటే......

అక్కడే పని లేక సొంత గూటికి చేరుకోలేక పులిచింతల ప్రాజెక్ట్ అవల చిక్కుకున్నారు. ఎంత బ్రతిమలాడిన నిబంధనలు ఒప్పుకోవు అంటూ సరిహద్దుల్లో వారి రాకను పోలీసులు అడ్డుకున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో మంత్రి జగదీష్ రెడ్డి సెల్ నెంబర్ తెలుసుకుని ఫోన్ లో నేరుగా మంత్రి జగదీష్ రెడ్డిని సంప్రదించారు.

విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి సరిహద్దుల్లో చిక్కుకున్న పాచ్యతండా వాసులను వారి సొంతూరికి చేర్చాలంటూ ఆదేశించారు. ఆదేశించడంతో పాటు పలుమార్లు వాకబు చేస్తూ వారు సొంతూరికి చేరేదాకా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వచ్చారు.దీనితో రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోదాడ ఆర్ డి ఓ కు వారిని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకు రావాలి అంటూ పురమాయించారు.

దానితో రంగంలోకి దిగిన ఆర్ డి ఓ పోలీస్ అధికారులను సమన్వయం చేసుకుని ఆదివారం పొద్దు పోయేంత వరకు వైద్యపరీక్షలు నిర్వహించి వారి వారి సొంత గ్రామాలకు చేరేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.ఎట్టకేలకు సోమవారం సాయంత్రానికి యింటికి చేరుకున్న తండా వాసులు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఫోన్ ఎత్తడం తో పాటు సురక్షితంగా తమను గమ్యానికి చేర్చిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా తమ మండల వాసులు పైగా గిరిజన బిడ్డలను సకాలంలో ఆదుకుని సొంతూర్లకు చేర్చిన మంత్రి జగదీష్ రెడ్డికి చివ్వేంల జడ్ పి టి సి సంజీవ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దుల్లో చిక్కుకుని ఆందోళనకు గురౌతున్న పాచ్యతండా వాసుల ఒక్క ఫోన్ కాల్ కు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అభినందనీయుడని ఆయన కొనియాడారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి సురక్షితంగా ఇండ్లకు చేరుకున్న పాచ్యతండా వాసులను కలుసుకొని ఆయన పరామర్శించారు.

click me!