లాక్ డౌన్... ఆకలి బాధ తట్టుకోలేక ఇద్దరి మృతి

By telugu news teamFirst Published Mar 31, 2020, 7:48 AM IST
Highlights

మరో ఘటనలో ఐఎస్ సదన్ దాసరి సంజీవయ్య నగర్ లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో రోడ్డు పక్కన 40-50 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. అతను కూడా ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు దేశంలో మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. కాగా... ఆ లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి దొరకక.. ఆకలి బాధతో ఇద్దరు కన్నుమూశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ జిల్లా కొడంగల్ కి చెందిన నర్రకోటి మహేష్ యాదవ్(38) కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. చంపాపేట పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. కాగా.. కొన్ని రోజులుగా అతనిని భోజనం లభించలేదు. దీంతో.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. రోడ్డు పై పడి ఉన్న అతనిని పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే చనిపోయినట్లు ఉస్మానియా వైద్యులు తెలిపారు.

మరో ఘటనలో ఐఎస్ సదన్ దాసరి సంజీవయ్య నగర్ లోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో రోడ్డు పక్కన 40-50 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. అతను కూడా ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో కరోనా కోరలు చాపుతోంది. తెలంగాణలో ఒక్క రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఆరుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్టు తెలిపింది. మార్చ్ 13-15 మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా సోకింది. 

వారిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారని నిన్న రాత్రి తెలంగాణ సర్కార్ అధికారికంగా ధృవీకరించింది. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రి, గ్లోబల్ ఆసుపత్రి, నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని తెలిపింది. 

వీరి ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని అనుమానిస్తున్న వారందరిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయని, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు తమంతట తాముగా, విధిగా సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుందని, కాబట్టి వారి గురించి ఎవరికి సమాచారం ఉన్నా వెంటనే ప్రభుత్వానికి తెలియపరచాలని కోరింది. 

ఈ నిజాముద్దీన్ ప్రార్థనలు జరిగేనాటికి దేశంలో లాక్ డౌన్ పరిస్థితులు లేవు. కాకపోతే అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్న చాలామందికి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. 

దేశమంతా కూడా ఇదే విషయమై రచ్చ నడుస్తోంది. 

మొన్న తెలంగాణలో సంభవించిన ఒక మరణం, ఎవరైతే ఒక వ్యక్తిని అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకొస్తే వైద్యులు అప్పటికే అతడు మరణించాడని ధృవీకరించారో , అతడు కూడా నిజాముద్దీన్ లో జరిగిన ప్రార్థనలు అటెండ్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి నిజానిజాలు తేలాల్సి ఉంది.

click me!