పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలంతో జనం వణికిపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు జనం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. సుల్తానాబాద్ శివారులోని పంట పొలాల్లో, ఎస్సారెస్పీ కెనాల్లో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు.

ఈ ప్రాంతాలకు తెల్లవారుజామున వాకింగ్ వచ్చే వాళ్లకు క్షుద్ర పూజల ఆనవాళ్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిమ్మకాయలు, ప్రాణం వున్న కోడిని ఆ ప్రాంతంలో వదిలిపెట్టారు. అంతేకాదు ఒక నల్లగుడ్డలో నవధాన్యాలు ఉన్నాయి.
undefined
ఆ పక్కనే చిన్న పిల్ల వాడికి సంబంధించిన గుడ్డలు ఉన్నాయి. దీంతో అటు వైపు నుండి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. ఆదివారం వచ్చిందంటే వాకింగ్కి వెళ్లే వారు కూడా భయానికి రావడం మానేశారు. అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా గ్రామ శివారు ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.