
నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగు చూసింది. మహిళలను బురిడీ కొట్టిస్తూ ఒకరి తర్వాత ఒకరిని విలియమ్స్ అనే వ్యక్తి వివాహాలు చేసుకుంటూ వచ్చాడు. మొదటి భార్య తనూజ ఫిర్యాదుతో బాగోతం వెలుగు చూసింది. చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను లోబరుచుకోవడం అతను అలవాటుగా చేసుకున్నాడు. బాగోతం బయటపడడంతో గుండెపోటు వచ్చిందంటూ విలియమ్స్ ఆస్పత్రిలో చేరాడు.
పలువురు ప్రముఖ రాజకీయ నేతలతో అతనికి పరియాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రాజకీయ నేతలతో అతను దిగిన ఫొటోలు టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. మహిళలతో అతను సన్నిహితంగా మెలిగిన ఫొటోలు కూడా టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. విలియమ్స్ మీద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Williams బాగోతం బయటపడడంతో బాధితులు ఒక్కరొక్కరే బయటకు వస్తున్నారు.
ఆస్పత్రి నుంచి విలియమ్స్ ను Nalgonda వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు సిద్ధపడ్డారు. చర్చికి యువతులను అతను లోబరుచుకుంటూ వచ్చాడు. యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అతనితో ఫొటోలు దిగినవారిలో చాలా మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. ఓ మంత్రి కూడా అందులో ఉన్నారు. అయితే, విలియమ్స్ బాగోతాలు వారికి తెలిసి ఉండే అవకాశం లేదు.
విలియమ్స్ వలలో మరింత మంది మహిళలు పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. Tanuja ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మరింత మంది విలియమ్స్ బాధితులు బయటకు రావచ్చునని భావిస్తున్నారు.
Also Read: విశాఖ: నిత్య పెళ్లికొడుకు కోసం వేట ఆరంభం.. న్యాయం చేస్తామన్న డీజీపీ
Also Read: నిత్య పెళ్లికొడుకు అరెస్ట్: 23 ఏళ్లలో నాలుగు పెళ్లిళ్లు