చైల్డ్ ఫోర్నోగ్రఫీ : 4వేల వీడియోలున్నాయంటూ.. బేరం.. జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్...

By AN TeluguFirst Published Nov 9, 2021, 10:47 AM IST
Highlights

ఢిల్లీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి నెల రోజుల క్రితం వాట్సాప్ సందేశం వచ్చింది.  Blue films ముఖ్యంగా మైనర్లపై చిత్రీకరించినవి ఉన్నాయంటూ ఆ సందేశంలో వివరాలున్నాయి. చిన్నపిల్లలపై నీలి చిత్రాల అంశంపై అవగాహన ఉన్న అతడు ఈ విషయాన్ని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.

హైదరాబాద్ :  చిన్న పిల్లలతో నీలి చిత్రాలు చిత్రీకరించి.. వాటిని విక్రయిస్తామని ప్రచారం చేసుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తిపై.. ఢిల్లీలోని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఓ అజ్ఞాత వ్యక్తి ఈ అంశంపై తమకు సమాచారం ఇచ్చారని కమిషన్ ప్రతినిధి పోలీసు ఉన్నతాధికారులకు వివరించారు. 

వాటిని Internetలో ఏ వెబ్సైట్లో ఉంచారు?  ఏ ఏ లింకులతో  విక్రయిస్తున్నారు? అనే వివరాలను  ఫిర్యాదులో పేర్కొన్నారు. పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నీలిచిత్రాలను విక్రయిస్తున్న నేరస్తుడి వివరాలను తెలుసుకున్నారు. విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. నీలి చిత్రాలకు సంబంధించి ఇంటర్ నెట్ లో పెట్టిన లింకులు,  వాటిని ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు అన్న అంశాలపై మరింత సమాచారం సేకరిస్తున్నారు.

వాట్సాప్ మెసేజ్.. తక్కువ ధరకే వీడియోలు..

ఢిల్లీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి నెల రోజుల క్రితం వాట్సాప్ సందేశం వచ్చింది.  Blue films ముఖ్యంగా మైనర్లపై చిత్రీకరించినవి ఉన్నాయంటూ ఆ సందేశంలో వివరాలున్నాయి. చిన్నపిల్లలపై నీలి చిత్రాల అంశంపై అవగాహన ఉన్న అతడు ఈ విషయాన్ని జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.

వెంటనే తనకు సందేశం పంపిన వ్యక్తి తో వాట్సప్ ద్వారా మాట్లాడాడు. తనకు వందల్లో నీలి చిత్రాల వీడియోలు కావాలని రెండు వేలు ఇస్తానని చెప్పాడు. అంత అవసరం లేదు రూ.500లు చాలంటూ.. నేరస్తుడు ఆ వ్యక్తికి బదులు ఇచ్చాడు. ఈ మేరకు నగదు బదిలీ చేయగానే సదరు నేరస్తుడు.. 4000 వీడియోలకు సంబంధించిన లింకులను పంపించాడు. వాటిని ఆ వ్యక్తిని  నేరుగా  National Commission for Protection of Child Rights కు పంపించాడు.

న్యూడిల్లీలో హైటెక్ వ్యభిచారం... వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలతో సహా రేట్ కార్డు

సంబంధిత లింకులు పరిశీలించిన కమిషన్ అధికారులు  ఐపీ చిరునామాలు hyderabadలో ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి  నిందితుడిని అరెస్టు చేయాలని అభ్యర్థించారు.

తీవ్రమైన నేరం కఠిన చర్యలు…

పిల్లలతో నీలి చిత్రాలు రూపొందించడం..  వాటిని  Internet, social mediaలో అప్లోడ్ చేయడం తీవ్రమైన నేరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. చిన్నారులపై చిత్రీకరించిన చిత్రాలు ఉన్న వెబ్సైట్లను చూస్తున్న వారిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ లో అంతర్భాగమైన జాతీయ నేర గణాంకాల బ్యూరో గుర్తిస్తుంది.

మారుమూల ప్రాంతాల నుంచి మెట్రో నగర వరకు నీలిచిత్రాల వెబ్సైట్లు వీక్షిస్తున్న వారిని గుర్తించేందుకు  ఈ బ్యూరో సీసామ్ అనే అమెరికన్ సంస్థతో నాలుగేళ్ల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ విదేశాల్లోని వెబ్సైట్లు నిర్వాహకులతో సంప్రదించి Child pornography చూసిన వారి ip చిరునామాలను సేకరిస్తుంది. ఆ తరువాత ఈ వివరాలను కేంద్ర హోంశాఖకు ఇస్తోంది.

ఈ వివరాలను కేంద్ర హోం శాఖ అధికారులు   ఆయా రాష్ట్రాల  నోడల్ సంస్థలకు పంపుతారు.  వాటి ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని నేరుగా జైలుకు పంపుతున్నారు.  
 

click me!