
తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లేమవుతాయి...
మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముస్లిం రిజర్వేషన్ల మీద మాంచి వేడిపుట్టించారు. అంతిమంగా ఏమవుతాయో ఏమోగాని, ఇపుడయితో జోరుగా చర్చ సాగుతూ ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రలో ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. చాలా మందికి మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లొచ్చాయి. కొందరికి ఉద్యోగాలొచ్చాయి. ఉద్యోగాలొచ్చిన వాళ్లకు ఆయన స్వయాన నియమాక ఉత్తర్వులిచ్చారు. తర్వాతవ్యవహారం కోర్టు వెళ్లింది. కోర్టు ముస్లింలకు రిజర్వేషన్లు మతపరమయినవని, అలాంటి రిజర్వేషన్లుచెలవనింది.
ఇపుడు తెలంగాణాలో ఇదే రాజకీయ చర్చ మొదలయింది. ఈ చర్చ అప్పటికంటే ఇపుడు ఇంకా జోరందుకుంది. ముస్లింలకు రిజర్వేషన్లిస్తే తెలంగాణో మరొక పాకిస్తాన్ అయిపోతుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హెచ్చరించారు. ముస్లిం రిజర్వేషన్ల మీద ఇంత తీవ్రమయిన వ్యాఖ్య ఎపుడూ ఎవరూ చేయలేదు. వెంకయ్య నాయుడు చేశారు. అంటే, బిజెపి ఈ విషయాన్ని ఎలా తీవ్రమయిన జాతీయ భద్రతా సమస్యగా చిత్రీకరిస్తున్నదో అర్థమవుతుంది. అందులో కాశ్మీర్ ఇంకా ప్రధాని నరేంద్రమోదీ పట్టులోకి రావడంలేదు. ఈ మధ్య జరిగిన ఒక ఎన్నికలో పోలింగ్ ఎంతఘోరంగా ఉందో చూశాం. ప్రజలు ఎన్నికలను పూర్తిగగా బహిష్కరించేశారు.
ఇలాంటపుడు వెంకయ్యనాయుడు ముస్లిం రిజర్వేషన్ లను వ్యతిరేకించారు. ఏదో ప్రతిపక్ష పార్టీగా వ్యతిరేకించడం కాదు, దీనితో ఇండియాలో మరొక పాకిస్తాన్ ఏర్పడేప్రమాదం ఉందని చాలా ఘాటైన వ్యాఖ్య చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర వ్యాపిత ఆందోళనకు పిలుపు ఇచ్చింది. శాసన సభ ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టాలనుకుంటున్నది. వచ్చే ప్రత్యేక అసెంబ్లీ సమావేశలలోనే ఈ రిజర్వేషన్ల బిల్లు వస్తున్నదేమో నని ఈ పార్టీ శంకిస్తున్నది. ఈనెల 17 అన్ని జిల్లాలలో ఆందోళన చేపట్టాలని కూడాపార్టీ కోర్ కమిటి పిలుపు నిచ్చింది.ఇంత తీవ్రమైన చేయడంసబబా. అందునా త్వరలో బిజెపి జాతీయ ాధ్యక్షుడు అమిత్ షా కూడా రాష్ట్ర పర్యటన కొస్తున్నారు. పాకిస్తాన్ వ్యాఖ్య తెలంగాణాలోపాగ వేసేందుకు పన్నిన వ్యూహమా.. తెలంగాణా హిందూ ముస్లిం విభజన సాధ్యమా... ఎంత రాజకీయ వ్యూహమయినా ఇది తీవ్రమయిన వ్యాఖ్యయే.
అటు వైపు కాంగ్రెస్ మరొక వైఖరి తీసుకుంది. మాటలు కాదు, చేతల చూపాలి. ముస్లింలకు , ఎస్టిలకు రిజర్వేషన్లు పెంచాలి, అమలుచేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ల హామీని ఇంతవరకు అమలుచేయనందుకు ముఖ్యమంత్రి ముస్లింలకు క్షమాపణలు కూడా చెప్పాలని కాంగ్రెస్ అంటున్నది. ఇపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఏదో కొత్త ప్రకటన చేస్తున్నట్లుగా ముస్లిం , ఎస్ టి రిజర్వేషన్ల మీద మాట్లాడటం వెనక రాజకీయ దురుద్దేశం ఉందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.ఇక సాకులు చెప్పకుండా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం వత్తిడి తీసుకురావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాపిత క్యాంపెయిన్ చేపట్టాలని కూడా ఆయన చెప్పారు.
ఈ పరిస్థితుల ముస్లిం రిజర్వేషన్లు ఏమవుతాయి. బిల్ వచ్చి, అమలు అయి గతంలో లాగా కోర్టు కెళుతుందా లేక ఇలా సుదీర్ఘ చర్చ గా మారి అన్ని రాజకీయపార్టీలకు ఓట్లు తెచ్చే నినాదంగా మారుతుందా, చూద్దాం.