హోంమంత్రిపై కేసు న‌మోదు చేస్తారా..? : సెక్యూరిటీ గార్డు చెంపపై కొట్టిన ఘ‌ట‌నపై రాజాసింగ్..

By Mahesh Rajamoni  |  First Published Oct 6, 2023, 10:37 PM IST

Hyderabad: తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ఓ కార్య‌క్ర‌మంలో సహనం కోల్పోయి.. త‌న సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బ కొట్టారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆ వీడియోలో హోం మంత్రి తన పీఎస్ఓను తనకు పుష్పగుచ్ఛం ఇవ్వమని అడగడం. ఆయ‌న అయోమయంగా కనిపించినప్పుడు చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. దీనిపై స‌ర్వ‌త్రా ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది. 
 


Goshamahal MLA T Raja Singh: తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ఓ కార్య‌క్ర‌మంలో సహనం కోల్పోయి.. త‌న సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బ కొట్టారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆ వీడియోలో హోం మంత్రి తన పీఎస్ఓను తనకు పుష్పగుచ్ఛం ఇవ్వమని అడగడం. ఆయ‌న అయోమయంగా కనిపించినప్పుడు చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. దీనిపై స‌ర్వ‌త్రా ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ‌ హోం మంత్రి మహమూద్ అలీ తన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్ వో)ని చెంపదెబ్బ కొట్టిన ఘటన కలకలం రేపింది. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను  మహమూద్ అలీ సన్మానిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న వీడియోలో, హోం మంత్రి తన పీఎస్ఓను తనకు పుష్పగుచ్ఛం ఇవ్వమని అడగడం, ఆయ‌న అయోమయంగా కనిపించినప్పుడు చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. ఆ పుష్పగుచ్ఛాన్ని ఇతరులు మహమూద్ అలీకి అందజేయ‌డంతో.. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందించారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో జరిగింది.

Latest Videos

undefined

ఈ ఘ‌ట‌న‌తో హోం మంత్రి తీరుపై స‌ర్వ‌త్రా ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక అధికారి ప‌ట్ల ఇలా ప్ర‌వ‌ర్తించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు అధికారిపై చేయి చేసుకోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ స్పందిస్తూ మంత్రిపై కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. ''ఒక సాధారణ పౌరుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే, పోలీసులు వేగంగా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేస్తార‌ని పేర్కొన్న ఆయ‌న‌.. పుష్పగుచ్ఛం ఇవ్వడంలో జాప్యం కారణంగా హోం మంత్రి ఒక పోలీసు అధికారిని బ‌హిరంగంగా చెంప‌పై కొట్టారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్), తెలంగాణ డీజీపీలు హోంమంత్రిపై చర్యలు తీసుకుంటారా'' అని ఆయన ప్రశ్నించారు.

ఈ ఘ‌ట‌న సంద‌ర్భంలో హోం మంత్రి "నాలయక్" అనే పదాన్ని ఉపయోగించడాన్ని కూడా రాజాసింగ్ ప్రస్తావించారు. కాగా, ఆ పోలీసు అధికారిని ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన బాబుగా గుర్తించారు. పోలీసు అధికారులను వీఐపీల రక్షకులుగా కాకుండా సేవకులుగా పరిగణిస్తున్నారనీ, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎత్తిచూపారు.

click me!