తెలంగాణలో ‘‘హంగ్’’ తథ్యం .. బీజేపీ నేత బీఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 6, 2023, 9:10 PM IST

తెలంగాణలో హంగ్ వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు నిత్యం ప్రజల్లో వుండాలని.. సీట్ల కేటాయింపు ఢిల్లీలో కాదు తెలంగాణలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 


మరికొద్దినెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హంగ్ వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలలో ఇవ్వరని.. అనవరంగా నేతల చుట్టూ తిరగొద్దని ఆయన నేతలకు సూచించారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు నిత్యం ప్రజల్లో వుండాలని బీఎల్ సంతోష్ పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ఢిల్లీలో కాదు తెలంగాణలోనే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ వున్న నేపథ్యంలో బీఎల్ సంతోష్ చేసిన ‘‘హంగ్ ’’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 

Latest Videos

అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను  ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని కోరారు. ప్రధాని మోడీ నాయకత్వంలో  దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ఆయన చెప్పారు.  ఎన్నికల సమయంలో తెలంగాణలో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని  జేపీ నడ్డా విమర్శించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో  బీజేపీ బలపడుతుందని నడ్డా  చెప్పారు. బీజేపీనే జాతీయ పార్టీగా జేపీ నడ్డా పేర్కొన్నారు. జాతిని ఐక్యంగా ఉంచే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆయన  చెప్పారు.

ALso Read: బ్రస్టాచార్ రిశ్వత్ సమితి: బీఆర్ఎస్‌పై జేపీ నడ్డాపై సెటైర్లు

సోనియా, రాహుల్, ప్రియాంకలదే  కాంగ్రెస్ పార్టీ అని ఆయన  విమర్శించారు.కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80కోట్ల మందికి ఉచితంగా రేషన్ సప్లై చేసిన ఘనత మోడీదేనన్నారు. ఇందులో తెలంగాణకి చెందిన  రెండు కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారని జేపీ నడ్డా చెప్పారు.  ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం భారత్ లో 13కోట్ల మంది పేదరికాన్ని జయించారన్నారు.  ఎన్నో ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ను ఎందుకు అబివృద్ధి చేయలేదని జేపీ నడ్డా ప్రశ్నించారు. ప్రధాని అవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను కేంద్రం నిర్మించిందన్నారు.  తెలంగాణలో కేసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు.

ఉజ్వల పథకం కింద సిలిండర్ కి 300 సబ్సిడీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.దీంతో 9కోట్ల 50లక్షల మందికి లబ్ది చేకూరుతుందని నడ్డా చెప్పారు. ఏడాదికి 6వేల కోట్లను రైతుల ఖాతాలో  కిసాన్ సమ్మన్ నిధి కింద జమ చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్న విషయాన్ని జేపీ నడ్డా గుర్తు చేశారు.ఇందులో 38లక్షల 50వేల తెలంగాణ రైతులు ఉన్నారు 

తెలంగాణ లో బీజేపీ గెలవాలి... మరోసారి కేంద్రంలో  బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని నడ్డా పార్టీ కార్యకర్తలను కోరారు. తొమ్మిది ఏళ్లలో 9లక్షల కోట్లను తెలంగాణకు కేంద్రం కేటాయించిందని  నడ్డా చెప్పారు. రెండు రోజుల్లో 20వేల కోట్ల అబివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని  చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.   
 

click me!