పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పరిహారాన్ని అందిస్తామని మంత్రి జూపల్లి అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పంట నష్టంపై రైతులకు కీలక హామీ ఇచ్చారు. వడగండ్ల వానకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో పొలాలను మంత్రి జూపల్లి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పలువురు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. పంట నష్టపోయిన రైతులు అధైర్యపడరాదని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పరిహారం అందిస్తామని వివరించారు.
అదే సందర్భంలో ఆయన రైతు భరోసా గురించీ మాట్లాడారు. ఇప్పటి వరకు 58.6 లక్షల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు వేశామని తెలిపారు. మిగిలిన వారికి వచ్చే వారం రోజుల్లో రైతు భరోసా సొమ్ము అమ్ముతుందని చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఫైర్ అయ్యారు. ఖజానా ఖాళీ చేసిందని అన్నారు.