మావి మతరిజర్వేషన్లు కావు తెలంగాణ రిజర్వేషన్లు

First Published Apr 12, 2017, 3:38 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని అందుకే తమిళనాడు తరహాలో అమలుకు నిర్ణయించామని చెప్పారు.

తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు  రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు.కొందరు చెబుతున్నట్లు తాము ఇచ్చేది మత పరమైన రిజర్వేషన్లు కాదని పేర్కొన్నారు.

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గతంలో అమల్లో ఉన్న రిజర్వేషన్లనే కాస్త పెంచుతున్నామని తెలిపారు.ఈనెల 15న మంత్రివర్గ భేటీ అనంతరం అదే రోజు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరుతామని తెలిపారు.  16న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి సభలోనే ఎస్టీ, బీసీఈలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై పూర్తి స్థాయిలో చర్చిస్తామని వెల్లడించారు.

 

ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో ముస్లింలకు వివిధ స్థాయిల్లో రిజర్వేషన్లు ఉన్నాయని తెలినారు. రిజర్వేషన్లు పరంగా చూస్తే తమిళనాడులో 69 , ఝార్ఖండ్‌లో 60, మహారాష్ట్రలో 52 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌, మెఘాలయ, నాగాలాండ్‌, మిజోరాంలో 80 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్రంలో సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని అందుకే తమిళనాడు తరహాలో అమలుకు నిర్ణయించామని చెప్పారు.

 

అలాగే సమైక్య పాలనలో  హెరిటేజ్‌ యాక్టు అసంబద్దంగా ఉందని, దాన్ని సరిచేసి సరికొత్తగా తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్‌ యాక్టును తీసుకురావడానికి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 

click me!