KCR: పార్లమెంటులో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలి.. త్వరలో ప్రజల్లోకి వస్తా: మాజీ సీఎం కేసీఆర్

By Mahesh KFirst Published Jan 26, 2024, 6:33 PM IST
Highlights

పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు తమ గళాలను బలంగా వినిపించాలని పార్టీ ఎంపీలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తాను త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నట్టూ వెల్లడించారు.
 

BRS Party: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రజల్లోకి రానున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నదని చెప్పారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు బలంగా తమ గళం వినిపించాలని సూచించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెలాఖరు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్బంలోనే కేసీఆర్.. బీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు.

పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ మాట్లాడారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రం కోసం పని చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం బలంగా మాట్లాడాలి సూచించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై ప్రశ్నలు సంధించాలని అన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని తెలిపారు.

Latest Videos

Also Read: Janasena: టీడీపీ-జనసేన పొత్తుపై దుమారం.. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకున్నాడు?

క్షేత్రస్థాయిలో బీఆర్ఎస పార్టీ పటిష్టంగా ఉన్నదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అందరమూ గట్టిగా పోరాడుదామని, ఎవరితోనూ సంబంధం లేకున్నా ఈ పని చేయాలని వివరించారు.

ఈ భేటీ అనంతరం, పార్లమెంటులో విభజన చట్టంపై మాట్లాడుతామని బీఆర్ఎష్ నేత కేశవరావు అన్నారు. తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్ పార్టీనే అని వివరించారు.

click me!