వరంగల్‌లో మోదీ టూర్‌.. కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం.. మరి ఈసారైనా హాజరవుతారా?

Published : Jul 06, 2023, 11:16 AM IST
వరంగల్‌లో మోదీ టూర్‌.. కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం.. మరి ఈసారైనా హాజరవుతారా?

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8న తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 6,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8న తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 6,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే దాదాపు రెండేళ్లుగా ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉంటూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారైనా ప్రధాని మోదీ పర్యటనకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్ వరకు ప్రధాని మోదీని  కలవడం కొనసాగించారు. కేంద్రంలోని బీజేపీతో కూడా సన్నిహితంగా వ్యవహరించారు. 

అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీవ్ర స్థాయిలో విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ప్రధాని మోదీతో కేసీఆర్ వేదిక పంచుకోవడం లేదు. గత రెండేళ్లలో చిన జీయర్ స్వామి ఆశ్రమంలో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ప్రారంభించేందుకు, ఇక్రిశాట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు, ఐఎస్‌బీ-హైదరాబాద్ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు, హెచ్‌ఐసీసీలో జరిగిన  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు, రామగుండంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను ప్రారంభించేందుకు, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కోసం.. ఇలా పలు సందర్భాల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. 

Also Read: మోదీతో సీఎం జగన్ సుదీర్ఘ భేటీ.. రెండు కీలక బిల్లలుకు మద్దతు కోరిన ప్రధాని..!!

అయితే ఈ సందర్భాల్లో ప్రధాని మోదీని కలిసేందుకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం ఉన్నప్పటికీ.. కేసీఆర్ అటువైపు చూడలేదు. ఈ సందర్భాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ప్రధానిని స్వీకరించి, వీడ్కోలు పలికారు. అయితే తాజాగా  మరోసారి ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 8వ తేదీన వరంగల్‌లో ఆయన పర్యటించనున్నారు. 

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో 8వ తేదీ ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.45కి వరంగల్‌‌కు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హన్మకొండ కొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగు పయనమవుతారు. 

ఇక, ప్రధాని మోదీ వరంగల్‌లో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి కేంద్రం సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపింది. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో పరిస్థితులు మారాయి. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్.. ఈ మధ్య కాలంలో విమర్శలను తగ్గించారు. గతంలో మాదిరిగా బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఈసారైనా.. ప్రధాని మోదీతో కేసీఆర్ వేదిక పంచుకుంటారా?, హకీంపేట ఎయిర్‌పోర్టులోనైనా మోదీకి స్వాగతం పలుకుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?