వేరు కాపురం పెడదామంటూ భార్య వేధింపులు... మనస్తాపంతో భర్త సూసైడ్

By Arun Kumar P  |  First Published Jul 6, 2023, 10:26 AM IST

అటు భార్యపిల్లలకు... ఇటు కన్నతల్లికి దూరంకాలేక తీవ్ర ఒత్తిడికి గురయిన వ్యక్తి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోచోటుచేసుకుంది. 


హైదరాబాద్ : వేరు కాపురం పెడదామంటూ భార్య ఒత్తిడిచేయడం అతడు భరించలేకపోయాడు.పుట్టింటివారిని తీసుకువచ్చి వేరు కాపురం గురించి భార్య గొడవకు దిగడంతో ఆ భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అటు భార్యాపిల్లలకు దూరం కాలేక, ఇటు వేరుకాపురం పెట్టి తల్లికి ఒంటరిగా వదిలిపెట్టలేక తీవ్ర మనోవేదన అనుభవించాడు.దీంతో డిప్రెషన్ కు లోనయిన అతడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని కుషాయిగూడ పోచమ్మగుడి ప్రాంతంలో మొలుగు వెంకట్ రెడ్డి తల్లీ, భార్యాపిల్లలతో కలిసి నివాసముండేవాడు. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే  అత్తాకోడలు చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతూ వెంకట్ రెడ్డికి తలనొప్పి తెచ్చిపెట్టేవారు.ఈ గొడవలు మరింత ముదరడంతో వేరుకాపురం పెడదామని భర్తను ఒత్తిడిచేయడం ప్రారంభించింది. కానీ ఈ వయసులో తల్లిని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లలేక వెంకట్ రెడ్డి అందుకు అంగీకరించలేడు. దీంతో భార్యాభర్తల మధ్య కూడా వివాదాలు చెలరేగాయి. 

Latest Videos

ఇటీవల మరోసారి భర్తతో వేరుకాపురం విషయంలో భార్య కళ్యాణి గొడవపడింది. అయినా అతడు తల్లికి దూరంగా వుండేందుకు అంగీకరించలేదు. దీంతో అలిగిన కళ్యాణి ఇద్దరు కూతుళ్లను తీసుకుని వరంగల్ లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. రెండునెలలుగా అక్కడే వుంటున్నా భర్త పట్టించుకోకపోవడంతో పుట్టింటివారిని హైదరాబాద్ కు తీసుకువచ్చి పంచాయితీ పెట్టింది. 

Read More  కారు డ్రైవర్ తో వివాహేతర సంబంధం.. పెళ్ళి చేసుకుంటానన్నాడని భర్త దారుణ హత్య..

అత్తను ఇంటినుండి పంపించాలని... ఆస్తిపాస్తులన్నీ పిల్లల పేరిట రాయాలని కళ్యాణి భర్తను కోరింది. అందుకు అతడు అంగీకరించలేదు.దీంతో పెద్దగా అరుస్తూ, భర్తను తిడుతూ ఆమె రోడ్డుపైకి వచ్చింది. భార్య, అత్తింటివారు గొడవతో పరువుపోయిందని వెంకట్ రెడ్డి బాధపడ్డాడు. గొడవ ఆపకుంటే ఆత్మహత్య చేసుకుంటానని వారిని హెచ్చరించాడు. అయినా కూడా వినిపించుకోకుండా భార్య, అత్తామామలు అలాగే గొడవ కొనసాగించారు.దీంతో అదేరోజు అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లి ఎంతో ప్రయత్నించింది. హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించినా ఫలితంలేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో నిన్న(బుధవారం) రాత్రి వెంకట్ రెడ్డి మృతిచెందాడు. అతడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)


 

click me!