టమాటా, పచ్చిమిర్చి బాక్సులను ఎత్తుకెళ్లారో దొంగలు. రేట్లు అకాశాన్నంటుతుండడంతో ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అంటున్నారు.
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మార్కెట్లో విచిత్ర ఘటన వెలుగు చూసింది. మార్కెట్లో ఉన్న టమాటా, పచ్చిమిర్చి బాక్సులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇదంతా సీసీ టీవీలో నమోదయ్యింది. రేట్లు విపరీతంగా పెరగడంతోనే వీటి దొంగతనానికి పాల్పడి ఉంటారని అంటున్నారు పోలీసులు.
గత కొద్ది రోజులుగా టమాటా, పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ కంటే వీటి ధరలు ఎక్కువైన సంగతి తెలిసిందే. సామాన్యుడి వంటింట్లో నిత్యావరసరమైన ఈ రెండింటిని తిరిగి అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద అందించే ఏర్పాట్లు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ దొంగతనం వెలుగు చూడడంతో అందరూ అవాక్కవుతున్నారు.

మరోవైపు కర్ణాటకలో కూడా టమాటా దొంగతనం జరిగింది. కర్నాటకలోని హసన్ లో 90 బాక్సుల టమాటా దొంగతనం జరిగింది. దీనికి సంబంధించి టమాటా రైతు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి సరఫరా చేయడం కోసం 90 బాక్సుల టమాటాను ట్రక్కులోకి ఎక్కించగా.. అతను ట్రక్కును దారి మళ్లించాడు.
ఆ టమాటాల విలువ రూ. 2.7 లక్షలు. అయితే, చేరాల్సిన లోడ్ చేరకపోవడంతో ఆ దొంగతనం వెలుగు చూసింది. వెంటనే టమాటా రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ ఉదయం దొంగను అదుపులోకి తీసుకున్నారు.