తెలంగాాణ తదుపరి డిజిపి సివి ఆనందేనా?... అర్హతలే కాదు సీఎం కేసిఆర్ అటువైపే మొగ్గు

By Arun Kumar PFirst Published Aug 5, 2022, 1:26 PM IST
Highlights

ఈ ఏడాది తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో తదుపరి డిజిపిపై చర్చ మొదలయ్యింది. ప్రస్తుత హైదరాబాద్ కమీషనర్ సివి ఆనంద్ కు ఈ పదవి దక్కనుందని ప్రచారం జరుగుతుంది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తదుపరి డిజిపి ఎవరనే చర్చ పోలిస్ వర్గాలతో పాటు పలు మేధావి వర్గాల్లో అప్పుడే మొదలయ్యింది. అందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఇటీవల పోలిస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుత డిజిపి మహేందర్ రెడ్డి ఈ డిసెంబర్ లో పదవి విరమణ చేస్తారని... ఆయన డ్రెస్ మాత్రమే మారి ప్రభుత్వంలో కొనసాగుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పకనే చెప్పారు.

ప్రస్తుత డిజిపి మహేందర్ రెడ్డి పదవీ విరమణ  అనంతరం టీఆర్ఎస్ పార్టీనుండి ఎమ్మెల్సీ లేదా ఖమ్మం ఎంపిగా పోటీచేసే అవకాశం ఇస్తారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే డిసెంబర్ తరవాత తెలంగాణ రాష్ట్ర పోలిస్ బాస్ గా ఎవరు బాధ్యతలు చేపడతారనే చర్చ పోలిస్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తుంది.

Read more  పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్: ప్రారంభించిన సీఎం కేసీఆర్

కానీ ఇప్పుడున్న పోలిస్ ఉన్నతాధికారుల్లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాత్రమే సరైన వ్యక్తని కొందరు మేధావులు భావిస్తున్నారు. రానున్నది ఎన్నికల సంవత్సరం కావటం, ఈ ఎన్నికలు టీఆర్ఎస్ కి కీలకంగా మారనున్నాయి. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బిజెపితో ఢీ అంటే ఢీ అన్నట్లు ఉండటంతో రాష్ట్ర పోలిస్ బాస్ గా సివీ ఆనంద్ మాత్రమే సరైన వ్యక్తని ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఆయన ఉంటేనే సరైన కమాండ్ చేయగలుగుతారని... అందుకే కెసిఆర్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారట. ఇదే విషయాన్ని సీఎం కెసిఆర్ కి అత్యంత సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ఏది ఏమైనా సివి ఆనంద్ కూడా కేంద్రంలో పని చేసిన అనుభవంతో పాటు, సైబరాబద్ కమీషనర్ గా, ఎన్నో కీలక పదవుల్లో పని చేశారు. రాష్ట్ర డిజిపి గా బాధ్యతలు చేపట్టడానికి సివి ఆనంద్ కు అన్ని అర్హతలు ఉన్నాయి. పోలిస్ వర్గాలు కూడా ఆయన డిజిపి అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. 

 

click me!