ఉపరాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాల అభ్యర్ధి మార్గెట్ అల్వాకే టీఆర్ఎస్ మద్దతు

By narsimha lode  |  First Published Aug 5, 2022, 12:58 PM IST


ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్ధి  మార్గెట్ అల్వాలకు మద్దతివ్వాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. 


హైదరాబాద్: Vice Presidential Election విపక్ష పార్టీల అభ్యర్ధి Margaret Alva కు ఓటు వేయాలని TRS నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ శుక్రవారం నాడు ప్రకటించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలు రేపు జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విపక్ష పార్టీల అభ్యర్ధికే మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ కు చెందిన 16 మంది ఎంపీలు  మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. తమ పార్టీ ఎంపీలు  మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తామని  టీఆర్ఎస్ ఎంపీ Keshava Rao తెలిపారు.ఈ విషయమై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది.

Latest Videos

undefined

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిని నిర్ణయించే సమయంలో జరిగిన సమావేశానికి టీఆర్ఎస్ నేతలు కూడా హాజరయ్యారు. కానీ మార్గెట్ అల్వాకు మద్దతు ప్రకటించే విషయమై ప్రకటన చేయలేదు. అయితే ఇవాళ ఈ విషయమై టీఆర్ఎస్ నేతలు అధికారికంగా మార్గరెట్ అల్వాకు మద్దతిస్తున్నట్టుగా ప్రకటించారు.

మార్గరెట్ అల్వా కు మద్దతును పలు విపక్ష పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే., ఆప్, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీలు మద్దతును ప్రకటించాయి. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొన బోమని టీఎంసీ ప్రకటించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిని నిర్ణయించే విషయంలో తమను సంప్రదించలేనే కారణంగా TMC ఈ నిర్ణయం తీసుకొందనే ప్రచారం కూడా లేకపోలేదు.

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి జగదీప్ ధన్ కర్ విజయం నల్లేరుపై నడకేనని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.  లోక్ సభలో బీజేపీకి 303  మంది, రాజ్యసభలో 91 మంది సభ్యులున్నారు. ఎన్డీఏకు జనతాదళ్ (యునైటెడ్), వైఎస్ఆర్ సీపీ, శివసేన, అన్నాడిఎంకె వంటి పార్టీల మద్దతు కూడా ఉంది. విపక్షాలకు చెందిన అభ్యర్ధి మార్గరెట్ అల్వాకు సుమారు 200 ఓట్లకు పైగా వచ్చే అవకాశం ఉందని  సమాచారం.


 


 

click me!