భర్తతో సినిమాకు వెళ్లిన భార్య అదృశ్యం.. వాష్ రూంకు వెళ్తున్నానని చెప్పి మాయం...

By SumaBala Bukka  |  First Published Oct 24, 2022, 12:12 PM IST

భర్తతో సినిమాకు వెళ్లిన భార్య అదృశ్యం అయ్యింది. సినిమా మధ్యలో వాష్ రూం కు వెడతానని చెప్పి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. దీనిమీద భర్త పోలీసులను ఆశ్రయించాడు. 


హైదరాబాద్ :  భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోచోటుచేసుకుంది.  ఏఎస్ఐ సాయిలు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్ లో సినిమాకు వచ్చాడు. సినిమా చూస్తుండగా శైలజ వాష్ రూమ్ రూంకు వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. 

దీంతో కంగారు పడిన భర్త బైటికి వచ్చి వెతికాడు. మహిళా సిబ్బందితో వాష్ రూంలో కూడా వెతికించాడు. కానీ భార్య జాడ తెలియలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శైలజతో  గత మే నెలలోనే భాస్కర్ రెడ్డికి వివాహం జరిగింది. తన భార్య దగ్గర సెల్ ఫోన్ కూడా లేదని, జాడ తెలియడం లేదని ఆదివారం ఆమె భర్త గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబి మాల్ లోని సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Latest Videos

డీఏవీ స్కూల్ నే రీ ఓపెన్ చేయాలి.. మా పిల్లల్ని వేరే స్కూల్స్ కు పంపం.. తల్లిదండ్రుల అల్టిమేటం...

ఇదిలా ఉండగా, అక్టోబర్ 17న హైదరాబాద్ లోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు’ అని భర్తకు లేఖ రాసిన భార్య 16 నెలల కూతురును తీసుకుని అదృశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన వదనల స్వామి, శిరీష దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి వీఎన్ రెడ్డినగర్ ఉంటున్నారు. వారికి పాప, బాబు ఉన్నారు. స్వామి ఎలక్ట్రీషియన్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. పనిలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు. అలాగే, అక్టోబర్ 7 పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు. 

అక్కడినుంచే రోజు భార్యతో ఫోన్ లో మాట్లాడేవాడు. ఈ నెల 14న ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో పక్కింటి వారికి ఫోన్ చేయగా ఉదయం షాపింగ్, సాయంత్రం బాబును తీసుకొచ్చేందుకు స్కూల్ కు వెళ్లానని చెప్పినట్లు పక్కింటివారు స్వామికి తెలిపారు. భార్య కదలికలపై అనుమానం వచ్చిన స్వామి సాయంత్రానికి ఇక్కడికి వచ్చి చూడగా శిరీషతో పాటు 16 నెలల కూతురు కనిపించలేదు. ఇంట్లో చూడగా నీతో ఉండటం నాకు ఇష్టం లేదు నా కోసం వెతకొద్దంటూ రాసిన లేఖ లభించడంతో స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అలాగే, నిరుడు జూన్ లో ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు వెల్తున్నానని చెప్పిన మహిళ.. ఆ తరువాత తనకు బతకాలని లేదంటూ భర్తకు మెసేజ్ చేసింది. భర్త మెసేజ్ చూసుకుని షాక్ అయి ఆమెను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసేలోపే అదృశ్యమయ్యింది. ఈ షాకింగ్ ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 4, 2021లో చోటు చేసుకుంది.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలో నివాసముండే రాజ్ కుమార్ ఓ చర్చ్ పాస్టర్. గురువారం ఇతడి భార్య కిశోరి (66) ఇంటినుంచి బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. మద్యాహ్నం తరువాత నాకు బతకాలని లేదంటూ ఫోన్ ద్వారా మెసేజ్ చేసింది. మెసేజ్ చేసిన తరువాత కొత సమయానికి.. అంటే సుమారు 3 గంటల ప్రాంతంలో ఆమె భర్త మెసేజ్ చూసుకున్నాడు. వెంటనే ఆందోళనలో ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది. 

వెంటనే ఆటోలో వెళ్లిన డ్రైవర్ ను విచారించగా ఆమె సచివాలయం గేట్ నెం.1 వద్ద దింపినట్లు తెలుపడంతో భర్త ఆ రోజు రాత్రి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!