భీమా డబ్బు కోసం భర్త హత్య, ఆపై డ్రామా...

Published : Jun 23, 2020, 08:30 AM ISTUpdated : Jun 23, 2020, 11:51 AM IST
భీమా డబ్బు కోసం భర్త హత్య, ఆపై డ్రామా...

సారాంశం

భర్త బీమా డబ్బుల కోసం భార్య భర్తను హతమార్చే ఘాతుకానికి పాల్పడింది. మరో ఇద్దరితో కలిసి కట్టుకున్నవాడిని హత్య చేసింది. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది

డబ్బు కోసం మానవవిలువలను కూడా మనుషులు మరిచిపోతున్నారు అని అనేక సంఘటనలు మనకు కనబడుతున్నాయి. తాజాగా ఇలానే డబ్బుకోసం భర్తను హతమార్చిన సంఘటన మనకు వరంగాల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. 

భర్త బీమా డబ్బుల కోసం భార్య భర్తను హతమార్చే ఘాతుకానికి పాల్పడింది. మరో ఇద్దరితో కలిసి కట్టుకున్నవాడిని హత్య చేసింది. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ అమాయకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామాకు తెరతీసింది. చివరికి పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఈ ఘటన ఈ నెల 19వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండ మార్కెట్‌ సమీపంలో చోటుచేసుకుంది. వరంగల్‌ రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం.... పర్వతగిరి మండలం హత్యాతండాకు చెందిన బాదావత్‌ వీరన్న (47), భార్య యాకమ్మ ఓ ప్రైవేటు పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్నారు.  

లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్‌ మూసివేయడంతో అందరూ ఇంటి వద్దే ఉంటున్నారు. ఇలా ఇంటివద్ద ఖాళీగా ఉండడంతో.... వీరన్న తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. పనికూడా లేకపోవడంతో డబ్బు కూడా లేదు. విసుగు చెందిన యాకమ్మ భర్తను కడతేర్చి, అతని పేరిట ఉన్న బీమా డబ్బులను దక్కించుకోవాలని . 

తనఒక్కదానివల్ల ఇది   ఇద్దరు దగ్గరు బంధువు భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఆ తరువాత వచ్చిన 20 లక్షల బీమా డబ్బును ముగ్గురు కలిసి పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 

పథకం ప్రకారం వీరన్నను మద్యం తాగుదామని నెక్కొండ మార్కెట్ సమీపానికి ఆ ఇద్దరు బంధువులు పిలిచారు. అక్కడ మద్యం సేవించిన తరువాత వీరన్న తలపై బంధాలతో మోదీ హత్య చేసారు. పక్కనే ఉన్న కాలువలో తోసి వేశారు.  

ఇక ఆ తెల్లారి యకమ్మ తన భర్త కనబడడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ డేటా, సీసీటీవీ ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu