ప్రియురాలి మీద మోజు.. భార్యకు విడాకుల నోటీసులు. భర్త ఇంటిముందు యువతి మౌనపోరాటం...

By AN Telugu  |  First Published Aug 2, 2021, 3:40 PM IST

చిట్ ఫండ్ లో నష్టాలు రావడంతో అదనపు కట్నం కోసం భర్త తో పాటు అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని.. దీంతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది.  ఇదే విషయమై స్థానిక పెద్దమనుషుల సమక్షంలో.. ఐదుసార్లు పంచాయతీ సైతం జరిగిందని.. అయినప్పటికీ విడాకుల నోటీసు పంపించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

వరంగల్ : ప్రియురాలి మోజులోపడి భర్త తనను పట్టించుకోవడం లేదని మౌనపోరాటంకి దిగిందో భార్య. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఆదివారం జరిగింది.  బాధితురాలి కథనం ప్రకారం.. కొప్పులకు చెందిన కొలిపాక మల్లికాంబ-బాపురావుల రెండో కూతురు హర్షిత అదే గ్రామానికి చెందిన సరోజన-మధుసూదన్ దంపతుల పెద్ద కుమారుడు వేణుమాధవ్ కు ఇచ్చి గత ఏడాది ఆగస్టు 5న వివాహం జరిపించారు.

ఆ సమయంలో 10 తులాల బంగారం, 15 లక్షల నగదు, 1.16 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లి అయిన నాటి నుంచి భర్త తనతో కాపురం చేయడం లేదని హర్షిత ఆరోపిస్తోంది. హన్మకొండలో సాత్విక చిట్‌ఫండ్‌ నడిపేవాడిని.. అందులో పనిచేసే యువతితో వివాహానికి ముందు నుంచే సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిపింది.  

Latest Videos

చిట్ ఫండ్ లో నష్టాలు రావడంతో అదనపు కట్నం కోసం భర్త తో పాటు అతని కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని.. దీంతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది.  ఇదే విషయమై స్థానిక పెద్దమనుషుల సమక్షంలో.. ఐదుసార్లు పంచాయతీ సైతం జరిగిందని.. అయినప్పటికీ విడాకుల నోటీసు పంపించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భర్త ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. ఆమెను గ్రామానికి చెందిన పలువురు మహిళలు సైతం అండగా నిలిచారు. విషయం తెలుసుకున్న పీఎస్సై సుమలత సిబ్బందితో చేరుకుని బాధితులతో మాట్లాడారు.

న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మౌన పోరాటాన్ని విరమింపజేశారు. అనంతరం భర్తతో, పాటుకుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్ కు తరలించారు. 

click me!