నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. హాలియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం ఉపఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై సమీక్ష చేపట్టారు.
నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు 15కోట్ల చొప్పున మొత్తం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి మరో 120 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. మొత్తంగా నియోజకవర్గానికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇవాళ(సోమవారం) నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హాలియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఉప ఎన్నికల హామీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... నాగార్జున సాగర్ లో రెడ్డి కల్యాణ మండపం గురించి నిధులతో పాటు స్థలం కేటాయించడం జరుగుతోందన్నారు. అలాగే షాదీఖానా కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ ప్రజాప్రతినిధులతో నాలుగైదు రోజుల్లో మంత్రి సమీక్ష నిర్వహిస్తారని... అప్పుడు నిధులు ఎలా ఖర్చు చేసుకోవాలో నిర్ణయించుకోవాలన్నారు.
undefined
అభివృద్ధి అంటే ఏంటో నాగార్జున సాగర్ ప్రజలకు రుచి చూపిస్తామన్నారు. ఇంకా అవసరాలుంటే మరోసారి నాగార్జున సాగర్ కు వస్తానని సీఎం తెలిపారు. ఇక్కడి ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నకిరేకల్, హుజురాబాద్ కు ఒక్కో లిఫ్ట్, మిర్యాలగూడలో మరో ఐదు లిప్టులను కలిసి మొత్తంగా జిల్లాలకు మొత్తం 15 లిప్టులను మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
నాగార్జున సాగర్ లో బంజారా భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. త్వరలోనే కేంద్ర చట్టం ప్రకారం పోడు భూముల సమస్య తీర్చడానికి సిద్దంగా వున్నామన్నారు.. త్వలోనే దానికి శ్రీకారం చుడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
read more దళిత బంధుతో బిపిలు పెరుగుతున్నాయి...: హాలియా సభలో ఈటలపై కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు
పార్లమెంట్ లో కేంద్ర మంత్రులే తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ప్రశంసిస్తున్నారు. సాగర్ లో చైతన్యవంతమైన ప్రజలున్నారు... అందువల్లే తన మిత్రుడు నర్సింహయ్య చనిపోతే ఆయన కొడుకు భగత్ ను గెలిపించారన్నారు. సాగర్ లో అభివృద్ధి పనులు వేగంగా కాదు అతివేగంగా పూర్తిచేస్తామన్నారు.
గతంలో మాజీ మంత్రి జానా రెడ్డి అసెంబ్లీలో వుండగా నాణ్యమైన విద్యుత్ ఇస్తామంటే ఎగతాళి చేశారని గుర్తుచేశారు. రెండేళ్ళలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటానని అన్నాడు. అయితే తాము మాటమీద నిలబడి ప్రజల విద్యుత్ కష్టాలను తీర్చాం... కానీ జనారెడ్డి మాటతప్పారు. అందుకే ప్రజలు సరయిన సమాధానం చెప్పారని ఎద్దేవా చేశారు.
ఆనాడు పేగులు తెగేవరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. ఇదే నాగార్జునసాగర్ కట్టమీద దండోరా మోగించి నీరు సాధించుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కృష్టా నదిలో నీటి వాటాను కూడా సాధిస్తామన్నారు. కోదాడ నుండి హాలియా వరకు పాదయాత్ర చేసి అనేక సమస్యలు తెలుసుకున్నా... ఇప్పుడు వాటిని పరిష్కరిస్తానని సీఎం తెలిపారు.
పాలన పట్లు అందరికంటే ఎక్కువ అవగాహన వుండేది ప్రజలకేనని... అందువల్లే నాగార్జునసాగర్ లో అద్భత పలితం వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు భీమాలతో రైతులకు ధీమా ఇచ్చామన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలోనూ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో వుంది. ఎవరెన్ని అవాకులు, చవాకులు మాట్లాడిన ప్రగతిని కొనసాగిస్తామన్నారు. నోముల భగత్ మీ బిడ్డ... అరిచి పిచ్చి డ్రామాలు వేయడం మంచిదికాదు... ఆయనకు మీ సమస్యలు తెలియజేయండి అని కేసీఆర్ ప్రజలకు సూచించారు.