కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి: హలియా సభలో కేసీఆర్ సంచలనం

By narsimha lode  |  First Published Aug 2, 2021, 3:25 PM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొంత కాలంగా జల జగడం కొనసాగుతోంది. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హలియాలో ఇవాళ నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



హలియా:కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారునాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల తర్వాత  సోమవారం నాడు నిర్వహించిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో ఏపీ ప్రభుత్వ తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కును కాపాడుకొంటామన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృష్ణా జలాల వివాదంపై చర్యలు చేపడుతామని ఆయన చెప్పారు.

also read:మీకు అభివృద్ధి రుచి చూపిస్తా... అందుకోసమే రూ.150 కోట్లు: నాగార్జునసాగర్ పై కేసీఆర్ వరాలజల్లు

Latest Videos

ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలను వదులుకొనే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ, కేంద్రం వైఖరితో తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు, ఆర్డీఎస్  కుడికాలువ  నిర్మాణాన్ని కూడ  చేపట్టింది.ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావడాన్ని కూడ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాల్లో సగం వాటాను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

click me!