
మానవ సంబంధాలు రోజు రోజుకీ మరింత దారుణంగా దిగజారిపోతున్నాయి. చిన్న పాటి సుఖం కోసం ఎంతటి ఘోరానికి పాల్పడటానికి కూడా ఎవరూ వెనకాడటం లేదు. తాజాగా.. ఓ మహిళ ప్రియుడితో రాసలీలల కోసం కట్టుకున్న భర్తను అతికిరాతకంగా హత్య చేయించింది. ఈ సంఘటన జహీరాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...దిగ్వాల్ గ్రామానికి చెందిన సయ్యద్ కరీం(26)ను ఈనెల 2వ తేదీన మహ్మద్ ముబీన్(26) అనే నిందితుడు తన స్నేహితుడికి సుపారి ఇచ్చి హత్య చేయించాడు. కరీం భార్యకి ముబీన్ తో గతంలోనే పరిచయం ఉంది. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఇటీవల కరీం భార్య ముబీన్ తారసపడింది.దీంతో గతంలో ఉన్న పరిచయం కారణంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
తరచూ ఇద్దరు కలుసుకుంటూ.. రహస్య సహజీవనం చేయడం ప్రారంభించారు. కాగా.. కరీం కారణంగా వారిద్దరి సహజీవనానికి ఆటంకం ఏర్పడింది. దీంతో..ఎలాగైనా కరీంను వదిలించుకోవాలని అనుకున్నారు. ముబీన్ తన మరో స్నేహితుడు అబ్దుల్ సమద్(30)కి సపారీ ఇచ్చి మరీ.. దారుణంగా హత్య చేయించాడు.
కాగా.. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.