ప్రభాస్ తో వైఎస్ షర్మిలకు లింక్ కేసు: హైకోర్టులో నిందితుడికి చుక్కెదురు

Published : Apr 06, 2019, 09:26 AM IST
ప్రభాస్ తో వైఎస్ షర్మిలకు లింక్ కేసు: హైకోర్టులో నిందితుడికి చుక్కెదురు

సారాంశం

షర్మిలకు హీరో ప్రభాస్ తో సంబంధం అంటగడుతూ పెట్టిన పోస్టుపై తెలంగాణ డిటెక్టివ్ శాఖ పోలీసులు పి. వెంకటేశ్వర రావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలని వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై అభ్యంతరకరమైన పోస్టులతో దుష్ప్రచారం చేసిన కేసులో నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మహిళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారనే ఆరోపణపై ఆ కేసు నమోదైంది. 

షర్మిలకు హీరో ప్రభాస్ తో సంబంధం అంటగడుతూ పెట్టిన పోస్టుపై తెలంగాణ డిటెక్టివ్ శాఖ పోలీసులు పి. వెంకటేశ్వర రావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలని వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దాన్ని కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది. 

నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఎంసిఎ విద్యార్థి. షర్మిలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాననే ఆరోపణపై పోలీసులు తప్పుడు కేసు బనాయించారని నిందితుడు కోర్టుకెక్కాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, బెయిల్ పై అతను బయటకు వచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?